ఈసారి రాశీ కోరిక తీరుతుందా?

స్లో అండ్ స్టడీ అన్నట్లుగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది రాశీఖన్నా. ఎక్కడా గ్యాప్ మాత్రం లేదు. రాను రాను మరింత గ్లామర్ గా తయారవుతూ, అభిమానులను అలరిస్తోంది.అయితే గతంలో ఓ చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అదే మెగా హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం. రంగస్థలం సినిమాలో రాశీఖన్నా నటిస్తుందని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో సమంత వచ్చి చేరింది.

ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, రాజమౌళి చేయబోయే మల్టీ స్టారర్ లో రాశీఖన్నా కోరిక తీరే అవకాశం వుందన్నది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లకు హీరోయిన్లు కావాలి.ఇందులో చరణ్ సరసన రాశీఖన్నాకు చాన్స్ వస్తుందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన మాత్రం మల్టీ లాంగ్వేజెస్ సినిమాలకు పరిచయం వున్న అమ్మాయిని తీసుకుంటారని టాక్.

వినిపిస్తున్న గ్యాసిప్ నిజమైతే రాశీఖన్నా పంట పండినట్లే. ఎందుకంటే రామ్ చరణ్ పక్కన నటించడం అన్నది మాత్రమే కాదు, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా చేయడం అన్నది.