‘సూర్య’ కోసం హాలీవుడ్ స్పెషలిస్ట్ లు

అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్ లో బన్నీవాసు, లగడపాటి రాజగోపాల్ నిర్మిస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో.. అనే పాటను పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించడం మాత్రమేకాదు. విదేశీ నిపుణులతోనే చిత్రీకరించడం విశేషం.

జోసెఫ్ లబిసి

ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మరియు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ సినిమాటోగ్రాఫర్, ఈయన తన టాలెంట్ ని పాప్ అల్బమ్స్ షూట్ చేయడంలోనే ఎక్కువుగా ఉపయోగించారు. ప్రముఖ పాప్ సింగర్స్ అరియాణ గ్రాండే, ఎనరిక్యూ ఇగ్లిసియ్స్, నిక్కిమినాజ్ వంటి వారితో వర్క్ చేశారు.

క్కిమినాజ్ అనకొండ ప్రపంచవ్యాప్తంగా ఎంతపాపులరో మనకు తెలిసిన విషయమే. దాదాపు 40కి పైగా ఇంగ్లీష్ పాప్ అల్బమ్స్కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇంత ఇంటర్నేషనల్ ప్రొఫైల్ ఉన్న జోసెఫ్ తొలిసారిగా అల్లుఅర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో లవర్ ఆల్ సో ఫైటర్ ఆల్ సో అనే పాటకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. దాదాపు 20రోజులకి పైగా అమెరికాలోని హాలీవుడ్ ప్రాంతంలో ఈ పాటకొసం లొకేష‌న్స్ రీసెర్చ్ చేశారు.

యాన మేరీ హోంగ్

ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్స్కి ఎందరికో కాష్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు యానమేరీ హోంగ్, ప్రప్రంచ ప్రఖ్యాత పాప్ క్వీన్ జెన్నీఫర్ లోపేజ్ కి కాష్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అలానే ప్రస్తుతం నిక్కీమినాజ్ తదితర సింగర్స్కి కూడా కాష్ట్యూమ్స్ అందిస్తున్నారు యాన్. ఇలా ఇద్దరు ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు కలిసి, నా పేరు సూర్య సినిమా కోసం ఓ సాంగ్ చేయడం కచ్చితంగా విశేషమే.