బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 675 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 676 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 12) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
మౌనిత పిచ్చిదానిలా గాల్లో లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. అయితే అది చూసిన ప్రియమణి(పనిమనిషి).. ‘ఓరి దేవుడో.. మౌనితమ్మకు పిచ్చి పట్టేసిందా? అయ్యో.. ఇప్పుడు నేను మళ్లీ ఏ ఇంట్లో పని వెతుక్కోవాలిరా దేవుడో’ అంటూ ఏడుస్తుంది. ఇంతలో మౌనిత తేరుకుని.. ‘ఏడవకు ప్రియమణీ.. త్వరలో నా కార్తీక్.. నా శోభనబాబు.. నా డార్లింగ్.. కార్తీక్.. ఆ దీపకు విడాకులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రెండు మూడు నెలల్లో మా పెళ్లి. అందరూ ఆహ్వానితులే.. కుళ్లుకునేవాళ్లు, ఏడ్చేవాళ్లు అందరికీ స్వాగతం’ అంటూ ఆనందపడిపోతూ ఉంటుంది. మళ్లీ తనే మాట్లాడుతూ.. ‘చూడు ప్రియమణీ.. నీకు ఆ ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ఆ మాలతీ(సౌందర్య ఇంట్లో పనిమనిషి)ని పీకించి.. నిన్ను అక్కడికి చేరుస్తాను. నా బాబు కార్తీక్‌తో ఈ పని చేయిస్తాను’ అంటుంది మౌనిత.
676 ఎపిసోడ్ హైలెట్స్..
సౌర్య హిమని తీసుకొచ్చి.. బెచ్ మీద కూర్చోబెట్టి… ‘ఇప్పుడు చెప్పు మా అమ్మతో ఏం మాట్లాడావ్?’ అని అడుగుతుంది. దాంతో హిమ భయపడుతూ.. ‘నువ్వు కోప్పడతావేమో?’ అంటుంది. ‘అంటే నువ్వు నన్ను అడిగిందే మా అమ్మకి కూడా అడిగావా? ఏం అంది?’ అని అడుగుతుంది సౌర్య. దాంతో.. హిమ భయపడుతూ.. ‘మాట్లాడాను.. ఏం సమాధానం చెప్పలేదు’ అంటుంది. ‘అయితే ముందు మీ డాడీతో ఈ విషయం గురించి మాట్లాడు. ఆ తర్వాత చూద్దాం. మీ డాడీని అడగడం కాదు.. ఒప్పించు’ అంటుంది సౌర్య. దాంతో హిమ నవ్వుతూ.. ‘అంటే ఇది నీకు ఇష్టమేనా?’ అనడంతో.. సౌర్య కూడా నవ్వుతూ.. ‘ఇష్టమే నేను మా అమ్మని ఒప్పిస్తాను. నువ్వు మీ నాన్నని ఒప్పించు’ అంటుంది. ఇద్దరూ చేతులు కలుసుకుని థ్యాంక్స్ చెప్పుకుంటారు.
కార్తీక్‌ని తీసుకుని మౌనిత లాయర్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ లాయర్‌కి దీపని ఎందుకు వదిలేశాడో అసలు కారణం చెప్పేయమని ఒత్తిడి చేస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆ విషయం చెప్పకుండా.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ విడాకులు రానప్పుడు మాత్రమే ఆ విషయం చెబుతాను’ అంటాడు. లాయర్ కూడా నమ్మకంగా.. ‘ఏది ఏమైనా విడాకులు వచ్చేలా చేస్తాను’ అంటాడు. దాంతో హ్యాపీగా బయటికి వచ్చిన కార్తీక్… ‘విడాకులు వస్తే హిమతో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్తాను’ అంటాడు. ‘మీతో పాటూ నేను వస్తాను కార్తీక్’ అంటుంది మౌనిత. సరే అంటాడు.
సౌర్య వారణాసికి తీసుకుని బుక్స్ కొనుక్కోవడానికి బయటికి వెళ్తుంది. హిమ సోపాలో కూర్చుని పడి పడి నవ్వుతుంది. ‘ఎందుకు నవ్వుతున్నావ్’ అంటూ సౌందర్య, ఆనందరావు, ఆదిత్యలు ఆరా తీస్తారు. దాంతో హిమ నవ్వుతూ.. ‘పొద్దున్న డాడీ మీద బైక్ పడింది కదా.. అప్పుడ వంటలక్క ఒక్కర్తే బైక్‌ని లేపేసింది. అది తలుచుకుంటే నవ్వు వస్తోంది’ అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి.. ‘బయలుదేరదామా హిమా?’ అని అడగడంతో… సరే అంటుంది. ‘ఎక్కడికి వెళ్తున్నారు నేను వస్తాను’ అంటుంది సౌందర్య.
హిమ, కార్తీక్, సౌందర్య కలిసి కారులో బయలుదేరతారు. సౌందర్య డ్రైవ్ చేస్తూ.. ‘నేను వస్తానన్న పాపానికి నన్ను డ్రైవర్‌ని చేసి పారేశారు’ అనుకుంటుంది మనసులో.. ఇంతలో కార్తీక్.. సౌందర్య కళ్లని కారు అద్దంలోనించి చూసి ‘నేను డ్రైవ్ చేయనా మమ్మీ?’ అంటాడు. హిమ నవ్వుతూ ఉంటుంది. ‘మీ డాడీకి కళ్లని చూసి మనసులో ఉన్నది గుర్తించడం చాలా బాగా వచ్చు. కానీ.. మనసుని చూసి మనిషి(దీప)ని గుర్తించడం చేతకాదు’ అంటూ చురకలు వేస్తుంది. దాంతో కార్తీక్ కోపంగా చూస్తాడు.
కమింగ్ అప్‌లో…
కార్తీక్, హిమ, సౌందర్య ముగ్గురూ కలిసి.. రగ్గులు, దుప్పట్లు పంచిపెడుతూ ఉంటారు. అదే లైన్‌లో సౌర్య, వారణాసి నిలబడతారు. కార్తీక్ ఇచ్చే దుప్పటి కోసం సౌర్య ధీనంగా చేతులు చాచుతుంది. హిమ, సౌందర్య, కార్తీక్ ముగ్గరూ షాక్ అవుతారు. హిమ ఆశ్చర్యంగా ‘సౌర్య నువ్వా?’ అంటుంది. రౌడీ నువ్వేంటీ అంటాడు కార్తీక్. సౌర్య వెనుకే ఉన్న వారణాసి.. ‘అదీ డాక్టర్ బాబూ.. బస్తీలో ఎవరో దుప్పట్లు పంచుతున్నారంటేను’ అంటూ నసుగుతాడు. సౌర్య ధీన పరిస్థితి చూసి.. సౌందర్య కళ్లనిండా నీళ్లతో నిర్గాంతపోయి చూస్తుంది. కార్తీక్ కూడా జాలిగా చూస్తుంటాడు. ఆ సీన్ ప్రేక్షకులను కలిచివేయడం ఖాయం. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.