బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 719 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 720 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (ఫ్రిబవరి 1) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
దీప శ్రావ్య పురిటి స్నానానికి వెళ్లేందుకు.. సౌర్య దగ్గర ‘హెల్త్ బాలేదు అత్తమ్మా.. జ్వరం వచ్చినట్లుగా ఉంది. నువ్వు స్కూల్‌కి వెళ్లు నేను డాక్టర్ దగ్గరకు వెళ్తాను’ అంటుంది. అది విన్న సౌర్య ‘నేను స్కూల్‌కి వెళ్లనమ్మా.. నీకు ఇలా ఉంటే నేను ఎలా స్కూల్‌కి వెళ్లాలి?’ అంటుంది బాధగా.. అయితే దీప బతిమలాడి సౌర్యని స్కూల్‌కి పంపిస్తుంది. ‘వారణాసి.. సౌర్యని స్కూల్ దగ్గర దింపేసి ఇంటికి రా.. హాస్పెటల్‌కి(శ్రావ్య వాళ్ల ఇంటికి) తీసుకుని వెళ్దూగానీ..’ అంటుంది. సరేనంటాడు వారణాసి.
ఇటు హిమ.. అటు సౌర్య..
హిమ స్కూల్‌కి డుమ్మా కొట్టి.. ‘తమ్ముడ్ని చూడటానికి నేను వస్తాను’ అంటుంది. అందుకు కార్తీక్ కూడా ఏం అడ్డు చెప్పడు. దీప సౌర్య దగ్గర అంత నాటకం ఆడటానికి కూడా కారణం ఉంది. హాస్పిటల్‌లో సౌందర్య, ఆనందరావులు.. ‘దీప మా పెద్ద కోడలు’ అని డాక్టర్ రిజ్వాన్ ప్రశ్నిస్తున్నప్పుడు చెప్పలేకపోవడంతో.. సౌర్య ఆవేశంగా ‘వీళ్లు ఎవ్వరూ మనకి వద్దు’ అంటూ సౌందర్య, ఆనందరావులని తిట్టి.. దీపని బలవంతంగా అక్కడ నుంచి లాక్కొచ్చేస్తుంది. (ఇటు హిమ శ్రావ్య దగ్గరకు, అటు సౌర్య స్కూల్‌కి వెళ్తుంది)
డబ్బులు తియ్యరా..
వారణాసి ఆటోని ఓ వ్యక్తి బండి మీద వెనుక నుంచి గుద్దేస్తారు. వెంటనే ఆ వ్యక్తే ఆవేశంగా వారణాసిని బయటికి లాగి.. ‘ఏంట్రా కళ్లు ఎక్కడ పెట్టి నడుపుతున్నావ్?’ అంటూ కొడుతుంటాడు. వెనుకనే మరో వ్యక్తి కూడా ఉంటాడు. ఇద్దరూ కలిసి వారణాసిని గదమాయించి.. ‘డబ్బులు తియ్యరా’అంటూ హడావుడి చెయ్యడంతో సౌర్య వాళ్లని అడ్డుకుంటుంది. ‘మీదే తప్పు.. మా మావయ్య ఏం తప్పు చెయ్యలేదు’ అంటూ తిడుతుంది.
వాళ్లదే తప్పు డాక్టర్ బాబు..
దాంతో అందులో ఒకడు.. ‘మధ్యలో నువ్వేంటే బుడ్డదానా’ అంటూ పక్కకు తోసేస్తారు. దాంతో సౌర్య పడిపోబోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. ‘ఏం జరిగింది?’ అంటాడు కాస్త కోపంగా.. ‘మమ్మల్ని గుద్దేశాడన్నాయ్.. డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు’ అంటాడు ఆ వ్యక్తి. వెంటనే సౌర్య కార్తీక్ వైపు చూస్తూ.. ‘వాళ్లదే తప్పు డాక్టర్ బాబు’ అంటుంది.
ఇక్కడ నుంచి వెళ్లండి..
వెంటనే కార్తీక్.. బైక్ పడిపోయిన తీరు గమనించి.. ‘కళ్లకు కనిపిస్తుందిగా.. అతడు ఒక్క పైసా కూడా ఇవ్వడు. మీరు ఇక్కడ నుంచి న్యూసెన్స్ చెయ్యకుండా వెళ్లండి’ అంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ వ్యక్తి రెచ్చిపోతాడు. ‘ఏంటన్నాయ్ నువ్వు ఇంత సపోర్ట్ ఇస్తున్నావ్ వీళ్లకి. వీడేమైనా(వారణాసి) నీకు బావమరిదా? ఆ పిల్ల(సౌర్య)ని అంత జాగ్రత్తగా పట్టుకున్నావేంటీ? అదేమైనా నీ కూతురా? లేక నీ సెటప్ కూతురా?’ అంటూ నోటికి వచ్చినట్లు వాగుతుంటాడు.
హలో ఏసీపీ కృష్ణా..
వెంటనే ఆవేశంగా కార్తీక్ ఉగ్రరూపంతో ఆ వ్యక్తిని లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు. దెబ్బకు కింద పడిపోతాడు. ‘అన్నయ్యా’ అంటూ పక్కనే ఉన్న మరో వ్యక్తి కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ ఫోన్ తీసి.. కాల్ చేసి.. ‘హలో ఏసీపీ కృష్ణా.. వీడెవరో ఇక్కడ తాగి గొడవ చేస్తున్నాడు. హెల్మెట్ కూడా లేదు’ అంటూ చెబుతుంటే.. అక్కడ నుంచి పారిపోతాడు వాళ్లు.
మా నాన్నే ఉండి ఉంటే..
కార్తీక్ వెంటనే వారణాసి వైపు చూసి దెబ్బలు గట్టిగా తగిలాయా? జాగ్రత్త.. చిన్న పిల్లలు ఉన్నప్పుడు వేయి కళ్లతో బండి నడపాలి’ అంటాడు. అదంతా విన్న సౌర్య.. కార్తీక్ వైపు ప్రేమగా చూస్తూ.. ‘అసలు మా నాన్నే ఉండి ఉంటే ఇలాగే చెప్పేవారు కదా డాక్టర్ బాబు’ అంటుంది. కార్తీక్ కాస్త ఇబ్బంది పడుతూ.. ‘ఎక్కు నువ్వు..’ అంటాడు.
మా అమ్మకు వంట్లో బాలేదు..
‘అసలు నేను స్కూల్ వెళ్లనన్నాను ఈ రోజు. కానీ మా అమ్మే నన్ను బలవంతంగా పంపించింది. పైగా మా అమ్మకు అసలు వంట్లో బాలేదు. ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్లను అనే మా అమ్మ హాస్పిటల్‌కి వెళ్తా అనింది’ అంటూ చెబుతుంది. దాంతో సౌర్యని పంపించి.. ఆలోచనలో పడుతాడు కార్తీక్.
కార్తీక్ ఆలోచన
‘దీప సౌర్యకు అబద్దం చెప్పిందనుకుంటా. శ్రావ్యని చూడ్డానికి వస్తుందేమో.. అంటే అక్కడికి హిమ కూడా వెళ్తుంది కదా? వాళ్లు మాట్లాడుకుంటే హిమకు దీప నా భార్య అని తెలుస్తుంది. లేదంటే ఆ మురళీ కృష్ణ చెప్పేస్తాడేమో’ అనుకుంటాడు కంగారు. వెంటనే మురళీ కృష్ణకి ఫోన్ చేస్తాడు.
ఇదేంటీ డాక్టర్ బాబు ఇక్కడున్నారు?
ఆటోలో కూర్చున్న సౌర్య మనసులో ‘అనవసరంగా బుక్స్ తీసుకోవడానికి ఆ రోడ్ వెళ్లాం. పోనీలో నాన్న నా మీద ప్రేమ చూపించారుగా.. అది మంచికే అనుకుంటా..’ అనుకుంటూ ఉంటుంది. అయితే మరో రోడ్డులో వెళ్తుంటే.. కార్తీక్ మురళీ కృష్ణతో సీరియస్‌గా మాట్లాడటం చూస్తుంది. ‘ఇదేంటీ డాక్టర్ బాబు.. అమ్మ దీపా అనే తాతయ్యతో మాట్లాడుతున్నాడు?’ అనుకుంటుంది ఆశ్చర్యంగా..
మురళీ కృష్ణకి వార్నింగ్
‘మీ కూతురు శ్రావ్య పురిటి స్నానానికి వస్తుంది కదా.. అప్పుడు హిమతో ఏం మాట్లాడకండి. హిమకు ఏ నిజాలు తెలయడానికి వీల్లేదు. దీప నా భార్య అని హిమకు తెలియకూడదు. సౌర్య నా కూతురని చెప్పకూడదు’ అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ‘ఏంటీ డాక్టర్ బాబు ఆ తాతయ్యకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్నారు?’ అంటూ సౌర్య ఆలోచనలో పడుతుంది. వారణాసి కూడా కార్తీక్‌ని చూసి ఆపా సౌర్యమ్మా అంటే.. ‘వద్దులే.. స్కూల్‌కి టైమ్ అవుతుంది’ అంటుంది సౌర్య.
సౌర్యకు నిజం తెలియదులే..
వారణాసి సౌర్యని స్కూల్లో దింపి.. దీపని శ్రావ్య దగ్గరకు తీసుకుని వెళ్లడానికి వస్తాడు. ‘హిమ కూడా స్కూల్‌కి వెళ్లిపోతుంది కాబట్టి సౌర్యకు ఇక నిజం తెలియదులే’ అనుకుంటుంది దీప. అయితే హిమ స్కూల్‌కి వెళ్లడం లేదు కాబట్టి.. అక్కడ వంటలక్కని చూసిన హిమ కచ్చితంగా సౌర్యతో చెప్పేస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.