వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే ముందు మూడేళ్లపాటు పాదయాత్ర చేశారు. వాన, ఎండ, చలిని తట్టుకొని పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఫలితంగానే 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్ అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారు. సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్న జగన్ ఓ విషయంలో మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు.
అదే ప్రత్యేక హోదా హామీ. ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే కేంద్రం మెడలు వొంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్నారు. అన్నట్టుగా ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఎప్పుడు ఎవరికీ సాధ్యం కానీ స్థానాల్లో వైకాపా ఎపిలో విజయం సాధించింది. ప్రతిపక్షానికి కనీసం డిపాజిట్లు కూడా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే వైకాపాను గెలిపించారో… దేశంలో మోడీ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా గెలిపించారు.
2014లో వచ్చిన మెజారిటీ కంటే 2019 లో వచ్చిన స్థానాలు అధికంగా ఉన్నాయి. సొంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయినా ఎన్డీయే పార్టీలకు పదవులు కట్టబెట్టింది. జగన్ కు ఎమ్మెల్యేలతో పాటుగా 22 ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ గెలిచినా కేంద్రంలో మాత్రం తన పట్టును నిలుపుకోలేకపోతున్నారు. కారణం కేంద్రంలో బీజేపీ సర్కార్ కు ఫుల్ మెజారిటీ ఉండటమే.
మరి ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఏం చేయబోతున్నారు. ఎలా హోదా తీసుకురాబోతున్నారు.. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ కు సాధ్యం అవుతుందా? కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అంటున్నారు. అయినా గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయలేదు. జగన్ హోదా కోసం ప్రజల్లోకి వెళ్లి ఎలా నిలబడ్డారో ఇప్పుడు కేంద్రం దగ్గర కూడా హోదా కోసం పోరాటం చేయాలి. అలా చేయగలడా? చూద్దాం.