న్యూడ్ గా నటించడంతో అన్నీ ఆ అవకాశాలే!

ఇమేజ్ అనేది హీరోహీరోయిన్లకు ఒక్కోసారి తలనొప్పిగా మారుతుంది. ఒక్కసారి ఆ ఇమేజ్ చట్రంలో పడ్డారంటే ఇక అందులోంచి బయటపడ్డానికి నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఆండ్రియా పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఓ సినిమాలో నగ్నంగా నటించిన ఈమెకు, అన్నీ అలాంటి అవకాశాలే వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

ఏడాది కిందట ఈమె ధనుష్ తో కలిసి వాడ చెన్నై అనే సినిమా చేసింది. అందులో ఆండ్రియా కాస్త ఓవర్ చేసింది. బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. సిల్వర్ స్క్రీన్ పై బ్యాక్ అంతా కనిపించేలా నటించింది. ఆండ్రియా బోల్డ్ లుక్ చూసి అప్పట్లో కుర్రకారు పిచ్చెక్కిపోయింది. కట్ చేస్తే, ఆ తర్వాత మళ్లీ ఆండ్రియా కనిపించలేదు. దీనికి వాడ చెన్నై సినిమానే కారణమని ఆరోపిస్తోంది ఈ బ్యూటీ.

ఆ సినిమా తర్వాత ఆమెకు అన్నీ అలాంటి అవకాశాలే వస్తున్నాయట. కావాలంటే 10 లక్షలు ఎక్స్ ట్రా ఇస్తాం బోల్డ్ గా నటించమనే ఆఫర్లు ఎక్కువయ్యాయట. అలా దాదాపు 10 సినిమాల్ని తిరస్కరించిందామె. దీంతో గతేడాది ఆండ్రియా నుంచి సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి.

మళ్లీ కొత్త ఏడాదిలో ఫామ్ లోకి వచ్చింది ఆండ్రియా. ప్రస్తుతం 5 తమిళ సినిమాలు చేస్తోంది. ఇందులో విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నానని చెప్పుకొచ్చింది. కథకు అవసరమైతే న్యూడ్ గా నటించడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని, తనను న్యూడ్ గా చూపించేందుకు మాత్రమే కథలు వండితే మాత్రం తిరస్కరిస్తానని అంటోంది ఈ చిన్నది. న్యూడ్ సీన్స్ లేకుండా, మంచి క్యారెక్టర్స్ తో వస్తే తన పారితోషికం కూడా తగ్గించుకుంటానని చెబుతోంది.