మాట నిలబెట్టుకున్న నాని

మెంటల్ మదిలో చేస్తున్న సమయంలో యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఒక కథని నానికి వినిపించాడు. కథ బాగుంది కానీ తీయగలవో లేదో అనే అనుమానం నాని వ్యక్తం చేసాడు. వివేక్ మొదటి సినిమా ఓకే అనిపించుకుంది. రెండవ సినిమా బ్రోచేవారెవరురా అందరి ప్రశంసలు అందుకుని విజయం సాధించింది.

దర్శకుడిగా నిరూపించుకుంటే తప్పకుండ సినిమా చేస్తానని నాని మాట ఇవ్వడంతో వివేక్ ఆ కథని అలాగే దాచి ఉంచాడు. ఇప్పుడు నాని తన మాట నిలబెట్టుకుని వివేక్ ఆత్రేయతో అదే కథతో సినిమా చేస్తున్నాడు.

అగ్ర హీరోలు ఇప్పుడు కొత్త దర్శకులతో ప్రయోగాలు చేసేందుకు సాహసించడం లేదు. బిజినెస్ వంద కోట్లు దాటిపోయిన ఈ తరుణంలో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. యువ దర్శకులకి నాని ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. అందుకే మంచి కథలన్నీ ముందుగా నాని దగ్గరికే వెళ్తున్నాయి.