స‌మంత …నాగ‌చైత‌న్య మ‌రో దేవ‌దాసు కాకుండా చూసుకో!

కొన్ని విష‌యాలను బ‌య‌ట‌కు చెప్ప కూడ‌దు. మ‌రీ ముఖ్యంగా పెళ్లికి ముందు జ‌రిగిన ప్రేమ వ్య‌వ‌హారాల‌ను…గ‌తఃగ‌త‌హాః అనే రీతిలో విడిచి పెట్టాలి. అలా విడిచి పెట్ట‌ని వాళ్ల‌ జీవితంలో చిచ్చు పెడ‌తాయి. ప్ర‌ముఖ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత అమాయ‌కంగా త‌న జీవితంలో ప్రేమ విష‌యాల‌ను త‌వ్వి తీస్తోంది. ఆమె చెప్పేవ‌న్నీ నిజం కావ‌చ్చు. కానీ నిజాల‌న్నీ ఒక్కోసారి మాట్లాడ‌లేం, మాట్లాడ‌కూడ‌దు కూడా.

`సరైన సమయంలో మేల్కొన్నా.. లేకపోతే నేను మరో సావిత్రిని అయ్యుండేదాన్న`ని సమంత ఓ ఇంట‌ర్వ్యూలో బాంబు పేల్చింది. ఏంట‌బ్బా …ఈ పిల్ల ఇలా మాట్లాడుతోందే అని అంద‌రూ అనుకున్నారు. సమంత గ‌తం గురించి తెలియ‌ని వాళ్ల‌కి కూడా ఆమె మాట‌లతో తెలిసిపోయింది.

హీరో సిద్ధార్థ్‌తో సమంత ప్రేమ వ్య‌వ‌హారం గురించి ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ విష‌యాల్లో అప్ప‌ట్లో చాలా కొద్ది మంది మాత్ర‌మే తెలుసు. వీళ్లిద్ద‌రి వ్య‌వ‌హారం అప్ప‌ట్లో పెళ్లి వ‌ర‌కు కూడా వెళ్లింద‌ట‌… అయితే కార‌ణాలేవో తెలియ‌దు కానీ, ఎవ‌రికి వారు సెలెంట్‌గా విడిపోయారు. ఆ తర్వాత అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, హీరో నాగార్జున కొడుకు, యంగ్ హీరో చైతన్యతో స‌మంత చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగింది. వాళ్ల‌ద్ద‌రి ప్రేమ విజ‌య‌వంతంగా పెళ్లితో ముగింపు ప‌లికింది.

తాజాగా `మోస్ట్ డిజైరబుల్ ఉమెన్`గా అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత త‌న మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి గుర్తు చేస్తూ…అలా జ‌రిగి ఉంటే అంటూ అల‌నాటి సావిత్రి జీవితంలా అయిపోయేద‌ని వాపోయారు. `మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర‌య్యాయో నా జీవితంలోనూ అలాంటివే చోటు చేసుకున్నాయి. అయితే నేను ముందుగానే ప‌సిగ‌ట్టి జాగ్ర‌త్త ప‌డ్డాను. ప‌రిస్థితి నా చేతుల్లో ఉండ‌గానే మేల్కొన్నా. ఆ బంధం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత చైతన్యలాంటి గొప్ప వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అవకాశం లభించింది ` అని సమంత చెప్పింది.

కానీ స‌మంత ఒక్క విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో యుక్త వ‌య‌సులో ప్రేమ‌, విడిపోవ‌డం లాంటివి అనుభ‌వంలోకి రావ‌డం స‌హ‌జం. వాటిని అంత‌టితో మ‌రిచిపోవ‌డం ఉత్త‌మం. ఎందుకంటే పెళ్లి త‌ర్వాత మ‌న‌తో పాటు భ‌ర్త అనే జీవిత భాగ‌స్వామి కూడా ఉంటార‌ని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటివి స‌మంత మ‌ళ్లీమ‌ళ్లీ రిపీట్ చేస్తే మాత్రం….నాగ‌చైత‌న్య దేవ‌దాసులా మారిపోతాడ‌ని అక్కినేని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతే క‌దా మ‌రి!