సిసిసి మెగా కంట్రోల్!

టాలీవుడ్ కార్మికులను ఆదుకోవాలన్న మంచి ఆశయంతో ఏర్పాటైన సంస్థ సిసిసి. కానీ చిత్రంగా ఈ సంస్థను ఇఫ్పుడు మెగా క్యాంప్ టేకోవర్ చేసినట్లు కనిపిస్తోంది. దీనికి చాలా తెలివైన ఎత్తుగడ వాడినట్లు కనిపిస్తోంది. బడా బాబులు విరాళాలు ఇవ్వాలంటే ఆదాయపన్ను మినహాయింపు వుండాలి. కానీ సిసిసి అనే సంస్థ ఇప్పుడు ప్రారంభమైంది. దానికి ఆదాయపన్ను మినహాయింపు రావాలంటే ఇప్పట్లో అయ్యేది కాదు.

అందుకే భలే ప్లాన్ వేసారు. సిసిసి ఫండ్ ను వేరేగా ఏర్పాటు చేసే ఆలోచన వదిలేసి, ఇప్పటికే వున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో కలిపేసారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున సిసిసి అనే పేరుతో కొత్త సేవింగ్స్ అక్కౌంట్ ఓపెన్ చేసారు. విరాళాలు మాత్రం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్-సిసిసి ఫండ్ అని ఇవ్వాలి.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత చిరంజీవి కాబట్టి ఆయన ప్రధానంగా అక్కౌంట్ హోల్డర్ గా వుంటారు. మరో ఇద్దరిని జాయింట్ గా పెట్టారు. ఇప్పుడు సిసిసి కార్యక్రమాల పర్యవేక్షణ అంతా గీతా సంస్థ నుంచే నడుస్తుంది. అల్లు అరవింద్ నే తెరవెనుక వుండి ఈ వ్యవహారాలు అన్నీ పర్యవేక్షిస్తున్నారని బోగట్టా. తెరముందుకు వస్తే మళ్లీ అంతా మెగా క్యాంప్ నే అంతా చేస్తోంది అన్న కలరింగ్ వస్తుందని, అంతా తెరవెనుకే వుంచారని బోగట్టా. చిత్రమేమిటంటే, అల్లు అరవింద్ తెరవెనుక నిర్వహిస్తున్నా, ఆయన సంస్థ అయిన గీతా నుంచి మాత్రం సిసిసి కి విరాళం ఏదీ ఇప్పటి వరకు అందలేదని తెలుస్తోంది.

అయితే గీతా సంస్థ తన ప్రొడక్షన్ లో వున్న సిన్మాల వర్కర్లు అందరికీ నేరుగా ఇప్పటికే సాయం అందచేసేసింది. అఖిల్ తో నిర్మించే సినిమా, అలాగే వరుణ్ తేజ్ తో సినిమాల యూనిట్ లు వున్నాయి. ఈ యూనిట్ జనాలకు గీతా నుంచి సాయం అందచేసినట్లు తెలుస్తోంది. అలాగే పాలకొల్లు ప్రాంతంలో గీతా సంస్థతో, బన్నీవాస్, అరవింద్ లతో అనుబంధం వున్నవారికి కొందరికి అయిదేసి వందల వంతున సాయం అందచేసినట్లు తెలుస్తోంది.