తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. ఎత్తుకు పైఎత్తు. దెబ్బకు దెబ్బ మామూలే. ఇద్దరి వ్యక్తుల మధ్య డీల్ కు ఉండే సాధారణ లక్షణాలే.. రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాల్లోనూ కనిపిస్తాయి. అయితే.. ఒప్పందం ఏదైనా.. తన ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఎదుటోడికి మేలు చేసేలా నిర్ణయాన్ని తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే.. జరిగే నష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కరోనాకు మందు లేని వేళ.. అంతో ఇంతో ప్రభావం చూపిస్తున్నదంటే అది హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలే.
ఈ విషయాన్ని ఇప్పటికే పలు దేశాలు తేల్చగా.. అమెరికాలో విరుచుకుపడుతున్న కరోనాకు ఔషధంగా పని చేస్తున్న ఔషధం భారత్ లో బాగా దొరుకుతుంది. అందుకే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా లైన్లోకి వచ్చేశారు. ప్రధాని మోడీతో మాట్లాడారు. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల అవసరం చాలా ఉందని.. తమకు సప్లై చేయాలని కోరారు. అందుకు ప్రధాని మోడీ ఓకే అన్నట్లుగా ప్రచారం జరిగింది. తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మిత్రుడు మాట ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. నిజానికి ఇదే మోడీకి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇద్దరు దేశాధినేతలు మాట్లాడుకున్న సంభాషణ సారాంశాన్ని ట్వీట్ రూపంలో ట్రంప్ పోస్టు చేయటంతో ఆరా మొదలైంది. ట్రంప్.. మోడీ మధ్య ఫోన్ కాల్ సారాంశమేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తనను రిక్వెస్టు చేసిన ట్రంప్.. ట్వీట్ పోస్టు చేసిన నేపథ్యంలో మోడీ మైండ్ సెట్ మారిందని చెబుతున్నారు.
ట్రంప్ మాటలకు ఓకే చెప్పిన మోడీ.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ ఎగుమతిపై మరిన్ని ఆంక్షలు విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది. కరోనాపై పోరాటంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తారు ట్రంప్. అంతటి కీలకమైన ఔషదాన్ని అమెరికాకు పంపిస్తే..తర్వాతికాలంలో భారీగా మూల్యం చెల్సించాల్సి వస్తుందన్న సందేహంతో పాటు.. దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ.. ఈ ఔషధ అవసరం ఎక్కువగా ఉంటుంది.
అందుకే.. మిత్రుడు ట్రంప్ చేసిన ట్వీట్ ను లైట్ తీసుకొని మరీ.. దేశం కోసం.. ప్రజల ప్రయోజనాల కంటే తనకేమీ ముఖ్యం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. మోడీ మాస్టారు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పాలి. ట్రంప్ దగ్గర స్నేహం కంటే.. మోడీకి దేశ ప్రజల వద్ద మైలేజీ చాలా ముఖ్యమన్ని ఆయనకు తెలిసినంత మరెవరికీ తెలీదని చెప్పాలి. తాజా ఎపిసోడ్ తో ఆ విషయం ట్రంప్ కు కూడా బాగానే అర్థం కావటం ఖాయం. ట్వీట్ పెట్టకుండా ఉండే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏమైనా.. సాయం అడిగిన ట్రంప్ కు.. నిక్కచ్చిగా వ్యవహరించి మోడీ తీరు ఆయన ఇమేజ్ గ్రాఫ్ ను దేశప్రజల్లో మరింత భారీగా పెంచేసిందని చెప్పాలి.