రెండు వారాల కిందట తెలంగాణలో రోజూ సింగిల్ డిజిట్లో కరోనా కేసులు నమోదవుతుండేవి. లాక్ డౌన్ మంచి ఫలితాలిస్తోందని.. కేంద్రం చెప్పిన ఏప్రిల్ 14 కన్నా వారం ముందే తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని.. లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం కూడా ఉందని ఉత్సాహంగా చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఆయన ఆ మాట రెండు మూడు రోజులకే పరిస్థితి మారిపోయింది.
ఢిల్లీలో తబ్లిగి జమాత్ నిర్వహించిన మర్కజ్ ప్రార్థనల పుణ్యమా అని దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అక్కడి నుంచి వచ్చిన వందల మంది కరోనా బారిన పడ్డారు. మరెన్నో వందల మందికి వైరస్ను అంటించారు. ఇప్పుడు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 700 దాటింది. దేశం మొత్తంలో కేసులు 13 వేల మార్కును దాటేశాయి. మరణాలు 400 మార్కును టచ్ చేశాయి.
ఇండియాలో కరోనా ఉద్దృతి ఇంతగా పెరిగిపోవడానికి తబ్లిగి జమాతే ప్రధాన కారణం అనడంలో మరో మాట లేదు. ఇండియాలో నమోదైన కరోనా కేసుల్లో 70 శాతానికి పైగా తబ్లిగి పుణ్యమే అని గణాంకాలు చాటి చెబుతున్నాయి. ఆ సంస్థపై ఉక్రోశంతో ఉన్నవారు ఇండియాలో ఏ రాష్ట్రానికి తబ్లిగి జమాత్ ఎంత కంట్రిబ్యూట్ చేసిందో చూడండంటూ ఒక ఛార్ట్ తయారు చేశారు.
దాని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో నూటికి నూరు శాతం కేసులు తబ్లిగి పుణ్యమేనట. అండమాన్ నికోబార్ దీవుల్లోని కేసుల్లో 91 శాతం తబ్లిగి ఖాతాలోనివేనట. తమిళనాడు కేసుల్లో 89.6 శాతం, అస్సాం కేసుల్లో 84.9 శాతం తబ్లిగి పుణ్యమే.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో 78.8 శౄతం కేసుల్లో, ఆంధ్రప్రదేశ్లో 70.4 శాతం కేసుల్లో తబ్లిగి ప్రమేయం ఉంది. ఢిల్లీలో 68.4 శాతం, హిమాచల్ ప్రదేశ్లో 63.6 శాతం, ఉత్తరప్రదేశ్లో 58.2 శాతం, హరియాణాలో 53.2 శాతం కరోనా కేసుల్లో తబ్లిగి ప్రమేయం ఉండటం గమనార్హం. ఈ గణాంకాల్ని బట్టి దేశంలో కరోనా వ్యాప్తిలో ఆ సంస్థ ప్రమేయం ఎంత అన్నది అంచనా వేయొచ్చు.