రాపిడ్ ఫైర్: రాజమౌళి ప్లస్ అండ్ మైనస్ చెప్పిన కీరవాణి

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. మీరు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటి అని అడిగితే.. ఈ స్థాయికి చేరుకోవడంలో నా కృషి ఎంత ఉందొ నాతో పని చేసిన ప్రతి ఒక్కరి కృషి కూడా అంతే ఉందని రాజమౌళి అంటుంటారు. ఎక్కువ భాగం ప్రతి సినిమాకి ఒకే టీం పనిచేస్తుంటుంది. అలాగే అందులో ఎక్కువ డిపార్ట్మెంట్స్ ని తన కుటుంబంలోని వారే డీల్ చేస్తుంటారు.

ఓ సినిమాకి బీజం పడే కథ దగ్గర నుంచి సినిమా పూర్తయ్యే వరకూ ఫ్యామిలీ లో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అందులో మొదటి సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ కీరవాణి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫామిలీలో మెంబర్స్ లోని ఒక పాజిటివ్ అండ్ ఒక నెగటివ్ క్వాలిటీని చెప్పారు. ఎవరెవరి గురించి ఏమేమి చెప్పారో చూసేద్దామా..

కళ్యాణి మాలిక్:

పాజిటివ్: మెలోడియస్ సాంగ్స్ కంపోజ్ చేసే విధానం సూపర్బ్.
నెగటివ్: తొందరగా వేరే వ్యక్తులకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాడు.

ఎస్ఎస్ కాంచి:

పాజిటివ్: ప్రతి విషయంలోనూ టు సైడ్స్ అఫ్ కాయిన్ చూడగలిగే సమర్ధత ఉంది.
నెగటివ్: కోపం ఎక్కువ.. అది తగ్గించుకోమని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను.

ఎస్ కార్తికేయ:

పాజిటివ్: తనకో పని అప్పగిస్తే కార్య దక్షతతో పర్ఫెక్ట్ గా ఫినిష్ చేస్తాడు.
నెగటివ్: ఎక్కువగా నిద్రపోతాడు. అంత నిద్ర మనిషిని పాడు చేస్తది.

కాలభైరవ:

పాజిటివ్: ఆత్మవిశ్వాసం ఎక్కువ..
నెగటివ్: బాగా బద్ధకస్తుడు.

సింహా:

పాజిటివ్: చాలా సెన్సిటివ్. ఎదుటి వారి ఫీలింగ్స్ ని చాలా బాగా అర్థం చేసుకుంటాడు.
నెగటివ్: అప్పుడప్పుడు హైపర్ అయ్యి అరుస్తా ఉంటాడు. బాగా సౌండ్ పొల్యూషన్, అది నచ్చదు.

రామ రాజమౌళి:

పాజిటివ్: డిగ్నిటీ ఆఫ్ లేబర్..
నెగటివ్: సండే వస్తే చాలు మమ్మల్ని ఇటాలియన్ రెస్టారెంట్స్ కి తీసుకెళ్తూ ఉంటది. నాకు ఇటాలియన్ ఫుడ్ ఇష్టముండదు.. సో అది నాకు నచ్చదు.

వల్లి (కీరవాణి గారి భార్య):

పాజిటివ్: డిసిప్లైన్..
నెగటివ్: నన్ను తిడతావుంటది.. అది నాకు నచ్చదు కానీ తప్పదు భరించాలి.

విజయేంద్ర ప్రసాద్:

పాజిటివ్: ఆశాజీవి. డిప్రెషన్ ని దారికి రానివ్వరు.
నెగటివ్: నా కన్నా పెద్దవారు. పెద్ద వాళ్లలో మనం నెగటివ్ చూడకూడదు, చూసినా మాట్లాడకూడదు.

ఎస్ఎస్ రాజమౌళి:

పాసిటివ్: ఒక పని మొదలు పెడితే పూర్తయ్యే వరకూ అదే చేస్తాడు. ఏకాగ్రత ఎక్కువ, మధ్యలో అస్సలు డీవియేట్ అవ్వడు.
నెగటివ్: ఎక్కువగా చిన్న పిల్లల సినిమాలు చూస్తుంటాడు. కాస్త మెచ్యూర్ సినిమాలు చూద్దాం అంటే మా తో కలిసి చూడడు