‘కరోనా వైరస్ నథింగ్ బట్ జ్వరం.. ఇట్ కమ్స్.. ఇట్ గోస్.. వస్తుంది, పోతుంది..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పదే పదే లైట్ తీసుకుంటుండడం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కరోనా వైరస్ అంటే మామూలు జ్వరం మాత్రమే కాదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌తో లంగ్స్ చెడిపోతున్నాయని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు జనసేనాని ఓ ట్వీట్ వేస్తూ, ఓ స్టడీని సైతం జత చేశారు.
కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. దీన్ని ‘కేవలం జ్వరం’గా ఓ ముఖ్యమంత్రి అభివర్ణించడమేంటి.? అని దేశమంతా విస్తుపోతోంది. నేషనల్ మీడియా కడిగి పారేస్తోంది. కానీ, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.. అన్నట్లు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1200 దాటేసింది. ప్రాణ నష్టం రానున్న రోజుల్లో మరింత పెరగబోతోంది. కేసుల సంఖ్య పెరగనుందని ప్రభుత్వమే చెబుతున్న దరిమిలా.. ప్రాణ నష్టం కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది కదా.!
ఉత్త జ్వరానికే ప్రాణాలు కోల్పోతాయా.? ఉత్త జ్వరానికే ప్రజా రవాణా బంద్ అవుతుందా.? ఉత్త జ్వరానికే దేశమంతా లాక్‌డౌన్ మోడ్‌లోకి వెళుతుందా.? ఈ రోజుల్లో క్యాన్సర్ వచ్చినా, బడుగు జీవి బతుకు చక్రం.. ప్రాణం పోయేదాకా కొనసాగాల్సిందే. అలాంటిది, కరోనా వైరస్ పొంచి వుంది జాగ్రత్త.. బయటకు రావొద్దు.. అని ప్రభుత్వాలెందుకు చెబుతున్నాయి.?
కరోనా వైరస్.. ఈ శతాబ్దపు అతి పెద్ద మహమ్మారి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కరోనా వైరస్ సోకితే గుండెకు సంబంధించిన నాడులు దెబ్బతింటాయని పలు సర్వేలు తేల్చాయి. ఊపిరితిత్తులు మాత్రమే కాదు, కిడ్నీ, కాలేయం.. ఇలా అనేక ముఖ్యమైన అంతర్గత అవయవాలు దెబ్బతింటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ ఇంత తీవ్రమైన మహమ్మారి. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తెలియకపోతే, కనీసం ఎవరన్నా చెబితే అయినా ఆయన వినాలి. అంతేగానీ, ముఖ్యమంత్రి హోదాలో వుండి, ‘ఇట్ ఈజ్ నథింగ్ బట్ జ్వరం.. ఇట్ కమ్స్.. ఇట్ గోస్..’ అని చెబితే ఎలా.?
COVID-19 (Corona) it’s not just a regular fever as we all might think; case studies in China,revealing,considerable lung damage is being caused to COVID- 19 patients,according to @ScienceNews . Please check. https://t.co/AxRFMHfQkq
— Pawan Kalyan (@PawanKalyan) April 28, 2020