తనకు కరోనా వచ్చి తగ్గిపోయిందని ప్రపంచం అందగత్తె, ప్రసిద్ధ పాప్ గాయని మడోన్నా వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తూ అనేక మంది ప్రముఖులకు కూడా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఇప్పుడా ప్రముఖుల జాబితాలో ప్రసిద్ధ పాప్ సింగర్ మడోన్నా కూడా ఉండటం గమనార్హం.
సింగర్‌గా మడోన్నా కళాభిమానులను ఉర్రూతలూగిస్తూ తనకంటూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల కరోనాను లెక్క చేయాల్సిన పనిలేదంటూ సోషల్ మీడియా ద్వారా సమాజానికి ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఆమె పంపిన విషయం తెలిసిందే.
తాజాగా మడోన్నా తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌పై ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. పారిస్ టూర్ తర్వాత తనకు కరోనా పాజిటివ్ వచ్చింది నిజమే అన్నారు. అలాగే పారిస్ టూర్‌కు తనతో పాటు వచ్చిన వాళ్లందరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందన్నారు. తామంతా ఆ సమయంలో భయపడిన మాట నిజమే అన్నారు. కానీ దేవుని దయవల్ల త్వరగా కోలుకున్నట్టు మడోనా తెలిపారు. ప్రస్తుతం తామంతా ఆరోగ్యంగా ఉన్నట్టు మడోన్నా తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌పై స్పష్టత ఇచ్చారు.