రకుల్‌ప్రీత్ సింగ్…సౌత్, నార్త్ అనే తేడా లేకుండా చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. లాక్‌డౌన్‌తో షూటిం గ్‌లు బంద్ కావడంతో చేసేదేమీ లేక ఆమె ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉన్నారామె. ‘ఏమైనా అడగండి.. చెబుతా’ అని ఫ్యాన్స్‌ని కోరడమే ఆలస్యం… వారి నుంచి ఎన్నో ప్రశ్నలు. ఆ చిట్ చాట్ ముచ్చట్ల సంగతు లేంటో తెలుసుకుందాం.
మీరు ఎలాంటి వ్యక్తుల్ని ఇష్టపడతారనే ప్రశ్నకు రకుల్ స్పందించారు. సమయాన్ని వృథా చేసేవారంటే తనకే మాత్రం ఇష్టం ఉండదన్నారు. అలాగే తమ పని విషయంలో నిబద్ధతతో ఉండని వారంటే ఇష్టం ఉండదని ఆమె చెప్పుకొచ్చారు. విజయాన్ని ఎలా నిర్వచిస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ…మనం ఎంత సంతోషంగా ఉంటున్నామనేదే విజయాలకు గుర్తు అన్నారు. జీవితంలో సంతోషం లేనప్పుడు ఎంత డబ్బున్నా, ఎంత కీర్తి ఉన్నా లాభం ఏంటి అని ఆమె ఎదురు ప్రశ్నించారు. అందుకే విజయాలపై తాను అతిగా ఆనందపడటం, అతిగా బాధపడటం ఉండదన్నారు. తన ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండటం వల్ల గెలుపోటము లకు తీవ్రంగా రియాక్ట్ కానన్నారు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ను తాను నమ్మనన్నారు. ఎందుకంటే తొలి చూపులో ఉండేది ఆకర్షణ మాత్రమే అన్నారు. తొలి చూపులోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ పుట్టదన్నారు. తానింకా ప్రేమలో పడలేదన్నారు. ప్రేమలో పడేందుకు ఎదురు చూస్తున్నట్టు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. తనకు ప్రియుడు కావాలని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు. డేటింగ్ చిట్కా చెప్పాలని అభిమానులు కోరగా….మీరు మీలా ఉండాలని సూచించారు.
ఒక వేళ ప్రియుడు మోసం చేస్తున్నాడని తెలిస్తే మీరేం చేస్తారనే ప్రశ్నకు…తనను ఎందుకు మోసం చేస్తున్నాడో అడుగుతా నన్నారు. నిజానికి ఒక బంధంలో మోసానికి చోటు ఉండకూదన్నారు. అలాంటి వాన్ని వదిలేస్తానన్నారు. మహిళ ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుందని ప్రశ్నించగా ఆమెలో ఆత్మ విశ్వాసం ఉన్నప్పుడు అని ఆసక్తికర సమాధానం ఇచ్చారు.