తల్లి కాబోతున్న ‘అఖిల్‌’ హీరోయిన్‌..!?

అక్కినేని హీరో అఖిల్‌ మొదటి సినిమా ‘అఖిల్‌’ చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌ గుర్తుంది కదా. తెలుగులో మొదటి సినిమానే ఫ్లాప్‌ అవ్వడంతో టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఎవరు ఆమెను పట్టించుకోలేదు. దాంతో తమిళం మరియు హిందీల్లో ప్రయత్నాలు చేసింది. అక్కడ ఒకటి రెండు సినిమాలు ఛాన్స్‌ వచ్చాయి. తమిళంలో నటిస్తున్న సమయంలో ఈ అమ్మడు కోలీవుడ్‌ హీరో ఆర్యతో ప్రేమలో పడ్డ విషయం తెల్సిందే. వీరి ప్రేమకు ఒప్పుకున్న ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి చేశారు.

మామూలుగా అయితే హీరోయిన్స్‌ సెలబ్రెటీలు పెళ్లి అయిన కనీసం నాలుగు అయిదు సంవత్సరాల వరకు పిల్లలు కనేందుకు ఆసక్తి చూపించరు. కాని సాయేషా సైగల్‌ మాత్రం అప్పుడే తల్లి కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా అయితే క్లారిటీ రాలేదు. కాని తమిళ మీడియాలో ఈ విషయంపై ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఆర్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తాడని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

తల్లి కాబోతున్న కారణంగానే సాయేషా షూటింగ్స్‌కు దూరంగా ఉంటుందని అంటున్నారు. ఒకటి రెండు కమిట్‌ అయిన సినిమాలకు కూడా ఆమె ప్రస్తుతానికి బ్రేక్‌ ఇచ్చిందట. ఒక సినిమాకు కమిట్‌ అయ్యి దాన్ని క్యాన్సిల్‌ చేసుకుందట. ఇక కొత్త సినిమాలు గత కొన్ని నెలలుగా ఈమె కమిట్‌ అవ్వలేదు. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈమె తల్లి కాబోతున్నట్లుగా కొడుతుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటీ అనేది ఆర్య కాని సాయేషా కాని నోరు విప్పితే కాని తెలియదు.