మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. త్రివిక్రమ్ జై చిరంజీవకు రైటర్ గా పనిచేసినప్పుడే వీరిద్దరి టైమింగ్ అదిరిపోయింది. ఇక చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళకముందు నుండే త్రివిక్రమ్ తో సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా కలిసి పనిచేయడానికి సుముఖంగానే ఉన్నారు.
చిరంజీవి అయితే పలు వేదికలపై త్రివిక్రమ్ తో సినిమా పై ఆసక్తి చూపించారు. అయితే ఎందుకనో ఎన్నేళ్ళైనా ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ చిరంజీవికి లైన్ చెప్పడం పూర్తయినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా ఈ లైన్ విషయంలో పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ – చిరంజీవి మూవీ త్వరలోనే పట్టాలెక్కుతుందిట. వచ్చే ఏడాది కానీ ఆ పై ఏడాది కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం కార్యరూపం దాల్చడం పక్కా అని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో లూసిఫెర్ చిత్ర రీమేక్ లో నటించాల్సి ఉంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కోసం వేచి చూస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు వెంటనే తన చిత్రం అయినను పోయి రావాలె హస్తినకు మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్.
సో ఈ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పక్కా అన్నది లేటెస్ట్ న్యూస్.