వి.సా.రెడ్డి.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ట్వీట్స్‌కి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగెటివ్ రెస్పాన్సే ఎక్కువ. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, విజయసాయిరెడ్డిని ట్రోల్ చేసే క్రమంలో ఆయన కంటే ఎక్కువగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు.. అందుక్కారణం విజయసాయిరెడ్డి ట్వీట్లే మరి.!
తాజాగా, నారా లోకేష్ తెలుగు పాండిత్యం గురించి విజయసాయిరెడ్డి ఓ ట్వీటేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలుగు పాండిత్యం గురించి తెలియనిదెవరికి. తెలుగులో మాట్లాడటం ఒకింత కష్టమే ఆయనకి. చాలాసార్లు తెలుగులో స్పష్టంగా మాట్లాడలేక, కొన్ని పదాలు బూతులుగా మారితే, లోకేష్ ఏ స్థాయిలో ట్రోలింగ్‌కి గురయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అలాగని లోకేష్‌ని పదే పదే ఎద్దేవా చేస్తే ఎలా.? వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా ఈ విషయంలో నారా లోకేష్‌కి ఏమాత్రం తీసిపోరు. ఆ మాటకొస్తే, లోకేష్ కంటే నాలుగాకులు ఎక్కువే చదివేసినట్టున్నారు వైఎస్ జగన్.. అందుకే, ఆయన నోట కూడా కొన్ని మాటలు తప్పుగా వచ్చేస్తుంటాయి. ఆ మాటకొస్తే, మాట తడబడటం అనేది ఎవరికైనా జరిగేదే. ఇక, విజయసాయి ట్వీట్, దానికి కౌంటర్‌గా వచ్చిన ట్రోలింగ్‌ని చూస్తే.. లోకేష్ మీద విజయసాయి ట్వీటోత్సాహం కాస్తా వైఎస్ జగన్‌ని ఇరకాటంలో పడేసింది.
లోకేష్ నోటి నుంచి వచ్చిన పొరపాటు పదాల్ని, వైఎస్ జగన్ నోట వచ్చిన పొరపాటు పదాలతో కంపేర్ చేస్తూ ట్వీట్లేస్తున్నారు నెటిజన్లు. ‘లోకేష్‌ని పప్పు అంటావా.? మీ వైఎస్ జగన్‌ని ఏమనాలి.. గన్నేరు పప్పు అనొచ్చా.?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, విజయసాయిరెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారనీ, వైఎస్ జగన్‌ని అభాసుపాలు చెయ్యడమే ఆయన పనిగా పెట్టుకున్నారనీ టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/bXQOz2BBco
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2020
ఇది సంగతి…#YSPappuBatch #GanneruPappu pic.twitter.com/Smq1fLVbAs
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) June 11, 2020
ఇది సంగతి…#YSPappuBatch #GanneruPappu pic.twitter.com/4IEUJzIM1c
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) June 11, 2020