జగన్ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ ఇంకా దాని అనుకూల మీడియా టముకేస్తున్న విషయం. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యువనేత, చినబాబు లోకేష్ నాయుడు ఓ ప్రకటన చేసారు. ‘ అన్నీ లెక్క పెడుతున్నాం, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం’ అంటూ.
దీని అర్థం ఏమిటి? తమకు అధికారం అందినపుడు తిరిగి పగ తీర్చుకుంటాం లేదా తమ వంతు వేధింపులు తాము చేస్తాం లేదా తమ వంతు కేసులు తామూ పెట్టగలం అనే కదా? అంటే దీనినే తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా భాషలో చెప్పాలంటే రాజకీయ కక్షసాధింపు అంటారు.
తాము రాజకీయ కక్షసాధింపులకు పాల్పడతాం అని బహిరంగంగా లోకేష్ ప్రకటిస్తూనే, జగన్ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడతుతున్నారు అని యాగీ చేయడం ఏమిటి? అవును ఇంకో సందేహం, జగన్ కాంగ్రెస్ ను వీడి స్వంత పార్టీ పెట్టారనే కదా? సోనియా గాంధీ ఆయనపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడిందని అనుకోవాలా? వద్దా?
జగన్ ది అయితే అవినీతి. జగన్ మీద కేసులు రాజకీయ కక్షసాధింపులు కాదు. కానీ అదే తెలుగుదేశం జనాలపై కేసులు అయితే అవినీతి కానే కాదు, పైగా రాజకీయ కక్ష సాధింపు. జనాలు అర్థం చేసుకోలేరా? ఈ పాటి పొలిటికల్ లాజిక్ ను?