ముచ్చ‌ట‌గా మూడో పెళ్లికి సిద్ధ‌మైన న‌టి

ముచ్చ‌ట‌గా మూడోపెళ్లికి న‌టి వ‌నితా విజయ్‌కుమార్ సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం సాగుతోంది. ఆమె పెళ్లికి స‌బంధించి పెళ్లి ప‌త్రిక కూడా వెలుగులోకి వ‌చ్చింది. 1995లో న‌టుడు విజ‌య్‌కు జంట‌గా చంద్ర‌లేఖ అనే చిత్రంలో వ‌నిత న‌టించి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. న‌టుడు విజ‌య‌కుమార్‌, మంజుల దంప‌తుల పెద్ద కుమార్తే వ‌నిత‌.

1995లో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయిన వ‌నిత ఆ త‌ర్వాత కొన్ని మ‌రికొన్ని సినిమాల్లో న‌టించారు. అదే స‌మ‌యంలో ఆమె 2000వ సంవ‌త్స‌రంలో నటుడు ఆకాష్‌ను పెళ్లాడారు. వీరి అన్యోన్య దాంప‌త్యానికి గుర్తుగా ఓ కొడుకు, కూతురు పుట్టారు. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు కానీ, వారి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. చివ‌రికి విడిపోయే వ‌ర‌కు దారి తీశాయి. 2005లో ఆకాష్‌, వ‌నిత దంప‌తులు విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను వ‌నిత రెండోపెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత అత‌నితోనూ పొస‌గ‌లేదు. దీంతో ఆనంద్‌తోనూ విడాకులు తీసుకున్నారు. అనంత‌రం నృత్య దర్శకుడు రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించార‌నే ప్ర‌చారం ఉంది.

ఇటీవల త‌మిళ బిగ్‌బాస్‌–3లో పాల్గొని వార్తల్లోకి ఎక్కిన వనిత తాజాగా మూడో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదండోయ్‌… ఈ నెల 27న చెన్నైలోని తన ఇంటి వద్దే అతి నిరాడంబ‌ర‌గా పీటర్‌ పాల్‌ అనే వ్యక్తితో వనిత వివాహం జరగనున్నట్లు ఓ పెళ్లి పత్రిక సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ పెళ్లి ప‌త్రిక వైర‌ల్ అవుతోంది. త‌న పెళ్లి గురించి నటి వనిత లేదా ఆమె త‌ర‌పు వాళ్లు స్ప‌ష్ట‌త ఇస్తే త‌ప్ప…నిజానిజాలు తెలిసి వ‌చ్చే అవ‌కాశం లేదు.