నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తారీకున తన 60వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెల్సిందే. ప్రతి సారి తన పుట్టిన రోజును అభిమానుల సమక్షంలో చాలా సందడిగా చేసుకునే బాలకృష్ణ ఈసారి మాత్రం కరోనా కారణంగా అతి కొద్ది మంది సమక్షంలో కుటుంబ వేడుకగా నిర్వహించుకున్నాడు. అభిమానులు ఈసారికి తన పుట్టిన రోజును భారీ ఎత్తున నిర్వహించకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా నిర్వహించాలంటూ బాలకృష్ణ పిలుపునిచ్చాడు.
బాలయ్య విజ్ఞప్తి మేరకు ఫ్యాన్స్ అంతా కూడా పుట్టిన రోజును ఎవరి ఇంటి నుండి వారే నిర్వహించుకున్నారు. అయితే బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా నందమూరి ఫ్యాన్స్ చేసిన పని ఏకంగా వరల్డ్ రికార్డ్ ను దక్కించుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బహుమానంగా నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణకు అందించారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఆరోజు 10 : 10 : 10 సమయంలో అభిమానులు అనేక చోట్ల నుండి 21 వేల కేక్స్‌ను కట్ చేశారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఈ రికార్డును నమోదు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఇంతటి భారీ స్థాయిలో ఒకే సమయంలో ఒకే వ్యక్తి కోసం కేక్స్ కట్టింగ్ జరగలేదని ఇది ప్రపంచంలోనే మొదటి భారీ పుట్టిన రోజు వేడుక అంటూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు పేర్కొన్నారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు కూడా ఈ రికార్డును నమోదు చేయడం విశేషం. మొత్తానికి బాలయ్యకు ఫ్యాన్స్ ఇచ్చిన షష్టిపూర్తి గిఫ్ట్ ఇతర హీరోలు సైతం అసూయ పడేలా ఉందంటున్నారు.