నందమూరి బాలకృష్ణ, బోయపాటిల కాంబినేషన్లో ఇప్పటి వరకు సింహా మరియు లెజెండ్ చిత్రాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకున్న నేపథ్యంలో త్వరలో రాబోతున్న చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
మొన్న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన వీడియోలో టైటిల్‌ను రివీల్ చేయలేదు. మోనార్క్ అనే టైటిల్‌ను ఖరారు చేసినా కూడా ప్రకటించలేదు. ఆ టైటిల్‌ను మార్చాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోనార్క్ టైటిల్‌నే ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే బాలయ్య షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు. వారణాసి మరియు కాశిలో చిత్రీకరించాలనుకున్న ఈ చిత్రంను ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే షూట్ చేయాలని నిర్ణయించారు.
వచ్చే నెల నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించబోతున్నారు. బోయపాటి ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాంతో పాటు మరో టైటిల్‌ను అనుకున్నప్పటికి మోనార్క్ చిత్రానికే ఎక్కువ క్రేజ్ ఉన్న నేపథ్యంలో దాన్నే ఫైనల్ చేయాలని నిర్ణయించారట. సింహా, లెజెండ్ల స్థాయిలో మోనార్క్ టైటిల్ పవర్ ఫుల్‌గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. కనుక మోనార్క్ టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది.