సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం జనగణమన అనే సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఇది బాగా ఇంటెన్స్ గా ఉండే పాట్రియాటిక్ మూవీ అని పూరి అప్పుడే ప్రకటించాడు. మహేష్ కు కూడా కథ నచ్చేసింది. అయితే పూరి ప్లాప్స్ లో ఉండడంతో అవకాశమివ్వడానికి సంశయించాడు. దాంతో జనగణమన పట్టాలెక్కలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గా పూరి జగన్నాథ్ జనగణమన గురించి మాట్లాడుతున్నాడు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తప్పకుండా ఈ సినిమా చేస్తానని, ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఈ చిత్రముంటుందని తెలిపాడు.
ఈ వార్తతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి గురయ్యారు. కచ్చితంగా పూరి, మహేష్ తోనే ఈ సినిమా చేస్తాడని ఆశిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరి మహేష్ తో చేయబోడని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి తెరకెక్కిస్తున్న ఫైటర్ చిత్ర బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, జనగణమన కథ విని బాలీవుడ్ హీరోలకు తగ్గట్లుగా దాన్ని సెట్ చేయమని అడిగాడట. లాక్ డౌన్ సమయంలో ఫైటర్ కాకుండా పూరి, జనగణమన స్క్రిప్ట్ పైనే వర్క్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫైటర్ తర్వాత పూరి తెరకెక్కించే ప్రాజెక్ట్ ఇదే కావొచ్చు. కాకపోతే బాలీవుడ్ హీరో ఆ చిత్రంలో ఉంటాడు. అదీ సంగతి.