టాలీవుడ్ లో సురేష్ కాంపౌండ్ కు ఓ స్పెషాలిటీ వుంది. ఆ కాంపౌండ్ హీరోలకు కథలు చెప్పి ఒప్పించడం అన్నది అంత వీజీ కాదు. స్క్రిప్ట్ కు సవాలక్ష కూడికలు-తీసివేతలు వుంటాయి. సురేష్ బాబు అనుభవం వుంటుంది. రానా ఇన్ పుట్స్ వుంటాయి. అక్కడ ఓ సినిమా ఓకె అయి సెట్ మీదకు రావాలి అంటే అంత సులువుగా సాధ్యం కాదు.
అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ పరిస్థితి కూడా అంతే. ఈసినిమాను తెలుగులోకి తేవాలని సితార ఎంటర్ టైన్ మెంట్స్ తలపెట్టింది. చిత్రంగా కాస్త పేరున్న డైరక్టర్లని పట్టుకోకుండా, ఎప్పుడో సినిమా చేసిన సాగర్ చంద్రను దగ్గరకు తీసి, తమ ఇన్ పుట్స్ తో, స్క్రిప్ట్ చేయించేసింది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ను మరి ఏ కాస్త పేరున్న డైరక్టర్ అయినా యాజ్ ఇట్ ఈజ్ గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఆఖరికి సాగర్ చంద్రనే డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు.
రానా, రవితేజ హీరోలుగా ఫిక్స్ అయ్యారు. ఇక్కడ రవితేజతో సమస్య లేదు. రానా దగ్గర వచ్చింది. అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు తనో వెర్షన్ తయారుచేయిస్తానని రానా అన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సురేష్ మూవీస్ లోని స్క్రిప్ట్ డిపార్ట్ మెంట్ అయ్యప్పన్ కోషియమ్ కు రానా ఇన్ పుట్స్ తో ఓ వెర్షన్ రెడీ చేస్తోందని తెలుస్తోంది.
అయ్యప్పన్ కోషియమ్ లో ఇద్దరు హీరోల పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్లు వుంటాయి. వెంకటేష్ గతంలో మల్టీ స్టారర్లు చేసినపుడల్లా, ఆయన పాత్రకే ఎడ్జ్ వుండేలా చూసుకున్నారు. ఇప్పుడు రానా మల్టీ స్టారర్ విషయంలో కూడా అదే స్కీముతో వెళ్తున్నట్లు కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ లెక్కన సాగర్ చంద్ర తయారు చేసిన వెర్షన్ ఏమవుతుందో?