అల్లు అర్జున్ అతని ఆశ తీరుస్తాడా?

ఎంసిఏ… మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా పెద్ద హిట్ అయినా తదుపరి అవకాశం కోసం వేణు శ్రీరామ్ చాలా కలం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే రెండేళ్ల పాటు ఐకాన్ కథ రాయడం కోసమే కేటాయించానని అతను చెబుతున్నాడు. అల్లు అర్జున్ కి ఈ కథ చెప్పి సింగిల్ సిటింగ్లో ప్రకటన ఇప్పించాడు. ఇప్పటికీ ఐకాన్ సినిమా బన్నీ చేస్తాడనే నమ్మకంతోనే వేణు ఉన్నాడు. ఈలోగా అనుకోకుండా వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని పవన్ కి మరపురాని సినిమాగా నిలిచిపోయేలా చేయాలని వేణు తపిస్తున్నాడు.

పింక్ రీమేక్ చాలా మంది చూసేసి ఉంటారు కనుక ఈ చిత్రాన్ని వేణు ఎలా మలుస్తాడనేది ఆసక్తి కలిగిస్తోంది. అందులోను పవన్ లాంటి కమర్షియల్ హీరోతో ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా అంటే కాస్త ఇబ్బందే. మరి దానిని వేణు ఎలా అధిగమిస్తాడో చూడాలి.

ఐకాన్ కథ తన కోసం ఉంచమని, వేరే హీరోకు వినిపించవద్దని బన్నీ చెప్పాడట. కానీ ఎప్పుడు చేస్తాడనేది చెప్పలేదు. అల వైకుంఠపురములో తర్వాత పుష్ప కూడా అంత హిట్టయితే బన్నీ తన మాటకు కట్టుబడి ఉంటాడా లేదా అనేది డౌటే.

కానీ ఒక స్టార్ హీరో కథ లాక్ చేసి పెట్టమన్నాక అతడి మాట కాదనడానికి ఎవరికీ ధైర్యం చాలదు. వకీల్ సాబ్ రిజల్ట్ అటు, ఇటు అయితే అది ఐకాన్ కి చుట్టుకుంటుందో లేదో కూడా తెలీదు.