యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాధాకృష్ణుల స్టైల్లో ఉన్న ప్రభాస్ – పూజ జోడీకి కూడా మంచి పేరు వచ్చింది. ఇది పక్కనపెడితే ఇప్పటికే ఈ సినిమా 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్స్ ఆగిపోయాయి , మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయి తెలియని అయోమయం.
షూటింగ్ విషయం అంటే కరోనా వల్ల ఆగింది, కానీ 70% షూటింగ్ అయిపోయినప్పటికీ ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. హిందీ మ్యూజిక్ కంపెనీ టీ సీరీస్ హక్కులని సొంతం చేసుకోవడం వలన వారు బాలీవుడ్ స్టైల్లో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ చేత ఒక్కో పాట కంపోజ్ చేయిస్తారు. అలా అనుకునే తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఇప్పటికే తన భాగమైన రెండు పాటలని కంపోజ్ చేసాడు.
ఇక్కడి వరకూ బాగానే ఉంది, సాహో విషయంలో జరిగినట్లు తెలుగు మ్యూజిక్ ప్లాప్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ చిత్ర ప్రొడక్షన్ యువి క్రియేషన్స్ వారు థమన్ తో మ్యూజిక్ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని టి సీరీస్ ముందుకు కూడా తీసుకెళ్లి చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్ లో, సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకెళ్తున్న థమన్ మ్యూజిక్ అయితే ఇటు తెలుగులో అటు హిందీకి కూడా సెట్ అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోందట. కానీ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు.
పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా, 70% షూటింగ్ అయినప్పటికీ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ కాకపోవడం, సాంగ్స్ అవ్వకపోవడం షాక్ కి గురిచేసే విషయం. మరి ఈ లాక్ డౌన్ లో అయినా మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనల్ చేసి సాంగ్స్ తీసుకుంటారేమో చూడాలి. ఒకవేళ థమన్ ఫైనల్ అయితే ప్రభాస్ సినిమాకి మొదటిసారి తను సంగీత సారధ్యం వహిస్తాడు.