విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వం వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ అయిన ఆ సినిమాను హిందీలో మరియు తమిళంలో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆ చిత్రం యూత్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ చిత్రం తర్వాత సందీప్ కొత్త సినిమాను ఇంకా ప్రకటించలేదు.
సందీప్ కొత్త చిత్రం విషయమై చర్చిస్తున్న సమయంలో కరోనా మొదలై మొత్తం ఆగిపోయింది. సినిమా మొదలు పెట్టే అవకాశం ఇప్పట్లో లేని కారణంగా వెబ్ సిరీస్‌కు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక వెబ్ సిరీస్ కు సందీప్ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేశాడట. అర్జున్ రెడ్డి ని మించి యూత్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ను చూపించిన ఈ దర్శకుడు వెబ్ సిరీస్‌లో మరింత ఘాటు రొమాన్స్‌ను చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. వెబ్ సిరీస్ అంటేనే బూతు కంటెంట్ అంటారు. ఇక సందీప్ కంటెంట్ అంతకు మించి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.