ఈ లాక్ డౌన్ సమయంలో రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్. తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించిన సోను సూద్, రియల్ లైఫ్ లో మాత్రం హీరోలా పనిచేసాడు. ఒకటా రెండా ఎన్నో సహాయాలు చేసాడు. వలస కార్మికులను సొంత గూళ్లకు చేర్చడం, విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్పెషల్ ఫ్లయిట్ లో ఇండియాకు రప్పించడం దగ్గరనుండి ఎంతో మందికి, సోషల్ మీడియాలో సహాయం అడిగిన చాలా మందికి తనవంతు సహాయం అందించాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న అల్లుడు అదుర్స్ షూటింగ్ లో సోను సూద్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. సోను సూద్ షూట్ లో జాయిన్ అయినప్పుడు అతనికి స్పెషల్ వెల్కమ్ ను ఇచ్చారు అల్లుడు అదుర్స్ టీమ్. ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా సోను సూద్ ను సన్మానించారు.
ఇక సోను సూద్ కు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో సోను సూద్ విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ముందుగా ఈ రోల్ కు సంజయ్ దత్ ను అనుకున్నారు కానీ అతనికి క్యాన్సర్ సోకడంతో ట్రీట్మెంట్ నిమిత్తం కొత్త సినిమాలు సైన్ చెయ్యట్లేదు. దీంతో సంజయ్ దత్ ను ఈ పాత్రకు అనుకుంటున్నారు.