నెట్‌ఫ్లిక్స్‌ ను ఒప్పించలేక పోయిన గుణశేఖర్

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దాదాపు ఆరు సంవత్సరాల క్రితం రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సమయంలోనే ఒక సినిమాను ప్రకటించిన గుణశేఖర్‌ ఆ సినిమాను పట్టాలెక్కించడంలో విఫలం అయ్యాడు. ఆ తర్వాత హిరణ్య కశ్యపుడు సినిమాను రానాతో మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను గుణశేఖర్‌ కూడా నిజమే అంటూ ఒప్పుకున్నారు. కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ కూడా లేదు. కరోనా కారణంగా ఆ సినిమా మరో ఏడాది వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఆయన వెబ్‌ సిరీస్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఒక స్ర్కిప్ట్ ను రెడీ చేశాడు.

భారీ వెబ్‌ సిరీస్‌ లను నిర్మించేందుకు ఎప్పుడు సిద్దం నెట్‌ఫ్లిక్స్‌ను ఈయన సంప్రదించాడు. మొదట స్టోరీ లైన్‌ విని ఇంట్రెస్ట్‌ చూపించిన వారు ఇప్పుడు పూర్తి స్క్రిప్ట్‌ రెడీ అయిన తర్వాత పెదవి విరిచి పక్కకు తప్పుకుంటున్నట్లుగా చెప్పారట. ఈ స్క్రిప్ట్‌ కు అంత బడ్జెట్‌ పెట్టలేమంటూ చేతులు ఎత్తేశారట. దాంతో మరో ఓటీటీని ఆయన పట్టుకునే పనిలో పడ్డాడు. వెబ్‌ సిరీస్ లకు పదుల కోట్ల పెట్టే సత్తా ఉన్న ఓటీటీ కేవలం నెట్‌ ఫ్లిక్స్‌ మాత్రమే. వారే నో చెప్పడంతో గుణ శేఖర్‌ కు ఇతర ఓటీటీలు బడ్జెట్‌ పెట్టేందుకు ముందుకు వస్తాయా అంటే అనుమానమే అంటున్నారు.

ఓటీటీ కంటెంట్‌ విషయంలో పలువురు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అంతా కూడా కోటి రెండు కోట్ల బడ్జెట్‌ లో స్టోరీలు తీసుకు వస్తుంటే గుణశేఖర్ మాత్రం అందుకు రెండు మూడు రెట్ల బడ్జెట్‌ ఖర్చు అయ్యే స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. అంత బడ్జెట్‌ అయినా నెట్‌ ఫ్లిక్స్‌ రెడీగా ఉంటుంది కాని ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్‌ వారికి నచ్చలేదు అంటూ మీడియా స్కర్కిల్స్‌ లో వార్తలు వస్తున్నాయి. మరి దానిలో మార్పు చేస్తాడా లేదంటే తానే సొంతంగా నిర్మించి ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతాడా అనేది చూడాలి.