బిగ్ బాస్ రియాల్టీ షోలో మొదటి నుంచీ ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ పేరుని గట్టిగానే వాడేస్తున్నారు కంటెస్టెంట్స్. ఇది మొదటి సీజన్ నుంచీ నడుస్తోంది. మొదటి సీజన్‌లో కాస్త తక్కువగానే వున్నా, రెండో సీజన్‌కి వచ్చేసరికి.. ఆ వాడకం చాలా ఎక్కువైపోయింది. నూతన్‌నాయుడు, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకునే హైలైట్ అయ్యాడు. కౌశల్ కూడా ‘పవన్ అభిమాని’ అనే ట్యాగ్‌తోనే ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మూడో సీజన్‌కి వచ్చేసరికి అషు రెడ్డి సహా మరికొందరు ‘పవన్’ ఇమేజ్‌ని అడ్డగోలుగా వాడేసిన వైనాన్ని చూశాం.
ఇప్పుడు నాలుగో సీజన్‌లో హౌస్ నుంచి బయటకు వచ్చాక దేవి నాగవల్లి, పవన్ కళ్యాణ్ పేరుని ఇంకోలా వాడేస్తోంది. నిజానికి.. ఆయా వ్యక్తులు పవన్ కళ్యాణ్ పేరుని వాడటం కంటే, వారి పేరుతో వారి ఫాలోవర్స్ ఎక్కువ వాడేస్తుండడం గమనార్హం. ‘పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను తొలుత తప్పుగా అర్థం చేసుకున్నారు.. వాళ్ళే ఆ తర్వాత నన్ను ఇష్టపడ్డారు..’ అంటూ దేవి పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్న విషయం విదితమే.
ఇంకోపక్క, సోహెల్ అభిమానులు, పవన్ కళ్యాణ్‌ని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. దానికి కౌంటర్‌గా పవన్ అభిమానుల్లో కొందరు స్పందిస్తున్నారు. అలా సోహెల్ పేరు అనూహ్యంగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. కొన్నాళ్ళ క్రితం సోహెల్, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి మద్దతిచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చుట్టూ ఇటు వైసీపీ అభిమానులు, అటు పవన్ అభిమానులు పెద్ద రచ్చే చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కాస్తా బిగ్ హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌కి అడ్వాంటేజ్‌గా మారుతోంది.
అయితే, బిగ్‌బాస్ రాజకీయాల్లోకి పవన్‌ని లాగొద్దంటూ పవన్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాన్ని కేవలం ఓ రియాల్టీ షోగానే చూడాలన్నది పవన్ అభిమానుల వాదన. ‘కొందర్ని మనం పనిగట్టుకుని సెలబ్రిటీల్ని చేస్తున్నాం.. ఇకనైనా అది మానుకుంటే మంచిది..’ అని పవన్‌ని నిఖార్సుగా అభిమానిస్తోన్న అభిమానులు చేస్తోన్న విజ్ఞప్తి.