కరోనా కారణంగా మద్యలో ఆగిపోయిన సినిమాలు.. షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉన్న పెద్ద సినిమాలకు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో మేకర్స్ చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. కాని పరిస్థితులు చూస్తుంటే జనవరిలో కూడా జనాలు థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. థియేటర్లు ఓపెన్ చేసినా కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో హౌస్ ఫుల్ అయ్యే పరిస్థితి లేదు. కనుక సినిమాలు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో వస్తే నష్టాల పాలవ్వడం ఖాయం. అందుకే వకీల్ సాబ్ సినిమా విడుదల విషయంలో ఆలోచన మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సినిమాను మార్చి లేదా ఏప్రిల్ కు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. మార్చి మరియు ఏప్రిల్ లో ఈసారి పరీక్షలు ఉండే అవకాశం లేదు. దానికి తోడు సమ్మర్ అవ్వడం వల్ల వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. కనుక జనాలు థియేటర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం బెటర్ అనే ఉద్దేశ్యంతో వకీల్ సాబ్ ఉన్నాడట. ఈ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
వకీల్ సాబ్ సినిమాలో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక కీలక పాత్రల్లో అంజలి మరియు నివేదా థామస్ లు నటిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు మరియు బోనీ కపూర్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ పింక్ కు రీమేక్ అయిన ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మూడు సంవత్సరాల తర్వాత పవన్ రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి.