మోనాల్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన సుదీర్ఘ సీక్రెట్‌ టాస్క్‌ సక్సెస్‌ అయ్యిందా?

బిగ్‌ బాస్‌ నాల్గవ సీజన్‌ నుండి మూడవ లేదా నాల్గవ వారంలోనే మోనాల్‌ బయటకు వచ్చేస్తుందని అంతా భావించారు. కాని ఆమె ఏకంగా 14 వారాల పాటు కొనసాగింది. ఫైనల్ వారంకు ముందు ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె ఎలిమినేషన్‌ విషయంలో ఎన్నో వారాలు ప్రచారం జరిగింది. బిగ్‌ బాస్ ఆమెను కాపాడుతున్నాడు అంటూ క్లీయర్‌ గా అర్థం అయ్యింది. ఆమె ఇంట్లో ఉంటే గొడవలు అఖిల్‌ మరియు అభిజిత్‌ మద్య ఎక్కువగా జరుగుతాయని బిగ్‌ బాస్‌ టీం భావించారు. అందుకే ఆమెకు ప్రేక్షకులు ఓట్లు వేయకున్నా కూడా సేవ్‌ చేస్తూ వచ్చారు.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో మోనాల్‌ కు బిగ్‌ బాస్‌ ఒక సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఆమె అఖిల్‌ లేదా అభిజిత్‌లలో ఒకరితో ప్రేమ వ్యవహారం నడిపించాలి. అది కుదరకుంటే మరెవ్వరితో అయినా కూడా హగ్ లు కిస్‌ లు ఇవ్వాలి. మొత్తానికి ఇంట్లో ఎప్పుడు నీ వల్ల గొడవలు లేదా మరేదైనా జరగాలి అనేది ఆమెకు బిగ్‌ బాస్ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ గా తెలుస్తోంది. ఆసీక్రెట్‌ టాస్క్‌ ను సోహెల్‌ పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్‌ చేసిందనే అనుకుంటున్నారు. ఆమె సరిగా టాస్క్‌ చేయకుంటే బిగ్‌ బాస్ అయిదవ లేదా ఆరవ వారంలోనే ఎలిమినేట్‌ చేసేవాడు. ఆమె వల్ల ప్రయోజనం కలిగింది కనుకే ఇన్ని వారాలు ఉంచాడు అనేది కొందరి మాట.