మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్టులను లైన్లో పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందులో రెండు రీమేకులు. ఈ రెండిట్లో ఒకటి తమిళ రీమేక్ కాగా, మరొకటి మలయాళ సినిమా రీమేక్. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.
ఇక లూసిఫెర్ రీమేక్ ను మోహన్ రాజా తెరకెక్కించనున్నాడు. మొదట సుజీత్, ఆ తర్వాత వివి వినాయక్ ఈ సినిమాలను రీమేక్ చేసే బాధ్యతలను తీసుకుని వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మోహన్ రాజా చేతుల్లోకి వెళ్ళింది. ధ్రువ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ చిత్రాన్ని మోహన్ రాజా రీమేక్ చేసాడు.
అయితే ప్రస్తుతం చేస్తోన్న ఆచార్య తర్వాత చిరంజీవి మొదట వేదాళం సినిమాను రీమేక్ చేయాలనీ భావించాడు. ఈ మేరకు మెహర్ కు షూటింగ్ కు వచ్చే ఏడాది నుండి సిద్ధమవ్వనున్నట్లు సంకేతాలిచ్చాడు చిరు. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వేదాళం రీమేక్ స్థానంలో లూసిఫెర్ నే మొదట రీమేక్ చేయాలనుకుంటున్నాడట.
ఈ రెండు సినిమాలు కాకుండా బాబీ దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సి ఉండగా దాన్ని చిరు ఆపేసినట్లు రూమర్స్ ఉన్నాయి.