కొడుకులతో అనసూయ చేసిన డాన్స్‌ పై ట్రోల్స్‌

జబర్దస్త్‌ బ్యూటీ అనసూయ ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ట్రోల్స్ వస్తున్నాయి కదా అని ఆమె తగ్గడం లేదు. నెటిజన్స్‌ ఎంత ట్రోల్‌ చేసినా ఆమె తీరు మారడం లేదు అంటూ మరింతగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన మీరు డీసెంట్ గా ఉండాలి అంటూ అభిమానులు పదే పదే సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. అయినా కూడా ఆమె మైక్రో షార్ట్‌ లు వేసుకుని టాప్ లెస్ అప్పుడప్పుడు బోటమ్‌ లెస్ అన్నట్లుగా ఉన్న డ్రస్‌ లు వేసుకోవడంతో విమర్శలు ఎదుర్కొంటుంది.

తాజాగా అనసూయ కుటుంబంతో కొత్త సంవత్సరం వేడుకకు వెళ్లింది. అక్కడ కొడుకులతో కలిసి ముక్కాల పాటకు డాన్స్ చేసింది. ఆ డాన్స్ లో అనసూయ వేసుకున్న షార్ట్‌ మరీ చిన్నగా ఉంది. దాంతో నెటిజన్స్‌ ఆమెను టార్గెట్‌ చేస్తున్నారు. నువ్వు వేసుకున్న షార్ట్‌ పెద్దగా అయ్యిందని కొందరు.. కొడుకులతో ఉన్నప్పుడు అలాంటి షార్ట్‌ లు ఎవరైనా వేసుకుంటారా అంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ ట్రోలింగ్‌ తో మళ్లీ బుక్కయ్యింది.