యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబో అనేది ఒక డ్రీమ్ అన్నట్లుగా అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆ డ్రీమ్ నిజం కాబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సలార్ మూవీ ప్రకటన వచ్చేసింది. పాన్ ఇండియా మూవీగా భారీ యాక్షన్ సినిమాగా దీన్ని ప్రశాంత్ నీల్ రూపొందించేందుకు సిద్దం అవుతున్నాడు. కేజీఎఫ్ 2 లో ఉండబోతున్న యాక్షన్ సీన్స్ ను మించి హై ఓల్టేజ్ సన్నివేశాలు సలార్ లో ఉంటాయని అంటున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
సలార్ లో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మను నటింపజేస్తారా లేదా సౌత్ హీరోయిన్ ను ఎంపిక చేస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. మాళవిక మోహన్ హీరోయిన్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నా కూడా కొత్త హీరోయిన్ కోసం ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కొత్త అమ్మాయిలతో ప్రశాంత్ నీల్ ఆడిషన్స్ నిర్వహించాడు. అందులో ఎవరైనా సెట్ అయితే ఆమెనే ఎంపిక చేసే అవకాశం ఉంది. సలార్ లో హీరోయిన్ రోల్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక భారీ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అక్కర్లేదు అనేది ప్రశాంత్ ప్లాన్ గా చెబుతున్నారు. మరి కొన్ని రోజుల్లో సలార్ హీరోయిన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.