తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో నిరుద్యోగులకు భృతి ప్రకటించడంతో పాటు 50 వేల ఉద్యోగాలకు ప్రకటన రాబోతున్నట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చాడు. నిరుద్యోగులకు ఇప్పటికే లక్ష ఉద్యోగాల వరకు ఇచ్చినట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రతిపక్ష పార్టీల నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే వారికి ప్రజలే బుద్ది చెప్తారంటూ హెచ్చరించాడు. మా సహనం కు హద్దు ఉంటుంది. దాన్ని పరీక్షించేలా మీరు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ విపక్ష పార్టీల నాయకులను కేటీఆర్ హెచ్చరించాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరెంట్ కష్టాలు లేకుండా అంతా సవ్యంగా ఉందని అన్నారు. కరెంట్ కట్టింగ్ లు లేకుండా రాష్ట్రంలో ఎప్పుడు విధ్యుత్ వెలుగులు విరజిల్లుతున్నాయని కేటీఆర్ అన్నాడు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు బండి సంజయ్ లకు పదవులు దక్కేవా అంటూ ప్రశ్నించాడు. మీ పదవులు కూడా టీఆర్‌ఎస్ వల్లే సాధ్యం అయ్యాయి అంటూ ఈ సందర్బంగా కేటీఆర్ అన్నాడు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని దాంతో పాటు నిరుద్యోగులకు కావాల్సిన భృతి ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ది ఫలాలను అందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.