బోల్డ్ ఎలిమెంట్ చుట్టూ లవ్ స్టోరీ కథ?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటించిన లవ్ స్టోరీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ భారీ అంచనాలకు చిత్రంలోని పాటలు ప్రధాన కారణం. ఇప్పటివరకూ నాలుగు పాటలు విడుదలైతే నాలుగు కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సారంగ దరియా సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరం చూసాం.

ఇక లవ్ స్టోరీ మెయిన్ పాయింట్ ఒక బోల్డ్ కాన్సెప్ట్ అని అంటున్నారు. ప్రతీ మహిళా కౌమార దశలో ఎదుర్కొనే సమస్యను బేస్ చేసుకుని శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ కథను అల్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త కథలకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. సో, శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ దర్శకుడు చెబితే ఆ కాన్సెప్ట్ ను కచ్చితంగా ప్రేక్షకులు పాజిటివ్ గా రిసీవ్ చేసుకునే అవకాశముంది.