ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు బాలీవుడ్ విలన్ కన్ఫర్మ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తయ్యాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్ర ప్రకటన గతేడాదే వచ్చినా కానీ కోవిద్ కారణంగా సినిమా షూటింగ్స్ ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్ట్ కూడా వెనక్కి జరుగుతూ వచ్చింది.

అయితే జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాను అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పెట్టనున్నారట. అలాగే ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను నటింపజేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా కూడా జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నారు. ఈ చిత్రానికి ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.