తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ వారికి ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జగదేకర్ ప్రకటించారు. రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాయి. ఒక సామాన్య వ్యక్తి నుండి అసమాన్య శక్తిగా అతడు ఎదిగాడు. ఆకాశమే హద్దు అన్నట్లుగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎదుగుదల సాగింది అనడంలో సందేహం లేదు. రజినీకాంత్ హీరోగానే కాకుండా నిర్మాతగా స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఇండస్ట్రీకి సేవలు అందించారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ.. రజినీకాంత్ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. భారత సినీ రంగంలో అత్యున్నత నటుల్లో ఆయన ఒకరు. అలాంటి రజినీకాంత్ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. రజినీకాంత్ గారిని ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నాడు. రజినీకాంత్ కు అత్యున్నత పురష్కారం లభించడం పట్ల ఆయన సన్నిహితులు మరియు సినీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.