న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి మంచి విజయం సాధించింది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. శివ నిర్వాణ సెకండ్ మూవీ మజిలీ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే లవ్ స్టోరీను చెప్పాడు.
ఈసారి శివ నిర్వాణ నుండి నానికు ఫోన్ వచ్చింది. కథ చెప్పాలని అనుకుంటున్నాడు. మళ్ళీ మరో ప్రేమకథ తెస్తాడు. కచ్చితంగా నో చెప్పాలన్న మైండ్ సెట్ లో ఉన్నాడట నాని. అయితే శివ నిర్వాణ ఈ సినిమాలో నాని క్యారెక్టర్ గురించి 10 నిముషాలు చెప్పగానే నాని మతిపోయిందట. ఇలాంటి స్క్రిప్ట్ కు నో ఎలా చెప్పగలం అనుకుని వెంటనే ఎస్ చెప్పేసాడు.
ఆ సినిమానే టక్ జగదీష్. ఏప్రిల్ 23న విడుదల కాబోతోంది. పై ఆసక్తికర అంశాన్ని నాని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసాడు.