ఏపీలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో కొన్ని చోట్ల గందరగోళ వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో వైకాపా నాయకులతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకుల మద్య వాదోపవాదాలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారికంగా తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం లేదు. అయినా కూడా పలు చోట్ల తెలుగు దేశం పార్టీ నాయకులు పోటీకి దిగారు. కర్నూలులో వైకాపా ఎన్నికల సందర్బంగా అక్రమాలకు పాల్పడుతుంది అంటూ అఖిల ప్రియ వర్గీయులు ఆందోళనకు దిగారు.
పోలింగ్ కేంద్రంలో సంబంధం లేని వ్యక్తి ఎలా పోలింగ్ ఏజెంట్ గా కూర్చుంటాడు అంటూ పోలీసులను అఖిల ప్రియ ప్రశ్నించింది. ఆ సందర్బంగా ఆమె పోలీసులను దబాయించినట్లుగా మాట్లాడటంతో పాటు వారి విధులకు అడ్డు తగలడం ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఆవెంటనే వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయడం జరిగింది. తెలుగు దేశం పార్టీ నాయకులను వైకాపా నాయకులు ఎన్నికల బూతులోకి కూడా రానివ్వక పోవడం కూడా కొన్ని చోట్ల గొడవకు దారి తీసింది.