యాంకర్‌ శ్యామల ప్రెగ్నెంటా?

తెలుగు బుల్లి తెరపై యాంకర్‌ గా ఎంతో మంది గుర్తింపు దక్కించుకున్నారు. వారిలో శ్యామల ఒకరు. యాంకర్‌ శ్యామల అంటే తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టేంతగా ఆమె పాపులారిటీని దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. తెలుగు బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె సోషల్‌ మీడయాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటుంది. ట్రెండ్డింగ్‌ లో ఈమె వ్యాఖ్యలు మరియు వీడియోలు ఉంటాయి. ఇక ఈమె తాజాగా అభిమానులతో లైఫ్‌ చాట్‌ చేశారు.

ఈ సందర్బంగా శ్యామలకు వింత వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో భాగంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంరా అంటూ కొందరు మీరు గర్బవతా అంటూ కొందరు కామెంట్‌ చేశారు. ఒక అభిమాని మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రశ్నించగా ఆమె ఆశ్చర్యంగా చూసే జిఫ్‌ ఇమేజ్‌ ను షేర్‌ చేసింది. ఇక మీరు ప్రెగ్నెంటా అంటూ ప్రశ్నించగా కాదు అన్నట్లుగా ఒక జిఫ్‌ ఇమేజ్‌ ను షేర్‌ చేసింది. మొత్తానికి ముద్దుగుమ్మ శ్యామల చేసిన లైవ్‌ చాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకా పలు ఆసక్తికర ప్రశ్నలకు కూడా ఆమె సింపుల్‌ గా ఫన్నీగా సమాధానాలు ఇచ్చింది.