పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాను, పవన్ కళ్యాణ్ నటనను పొగిడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వకీల్ సాబ్ చిత్రాన్ని కొనియాడాడు.
ఈ నేపథ్యంలో పీపుల్స్ జడ్జిగా కీర్తి గడించిన మాజీ సుప్రీమ్ కోర్టు జడ్జి జస్టిస్ వి. గోపాలగౌడ గారు వకీల్ సాబ్ చిత్రాన్ని అత్యుత్తమ చిత్రంగా పొగిడారు. “వకీల్ సాబ్ అత్యుతమ చలన చిత్రంగా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించలేదు, జీవించారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, స్వతంత్రం కోసం మదనపడే వ్యక్తి. మహిళల హక్కుల కోసం పోరాటం చేసే యోధుడిగా పవన్ కళ్యాణ్ నటన అత్యద్భుతం” అని వి. గోపాలగౌడ గారు వకీల్ సాబ్ చిత్రాన్ని పొగిడారు.