సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాతో బాధపడుతున్నారు. ఇటీవలే కరోనా పాజిటివ్ అంటూ నిర్థారన అవ్వడంతో కేసీఆర్‌ వెంటనే గజ్వేల్‌ లోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడ వైధ్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిపాలన విషయాలను పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్‌ ను ఫామ్‌ హౌస్ కు వెళ్లి కేటీఆర్‌ పరామర్శించారని వార్తలు వస్తున్నాయి.

కేటీఆర్ భౌతిక దూరం పాటించడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటిస్తూ తండ్రి కేసీఆర్‌ తో కేటీఆర్‌ మాట్లాడి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేటీఆర్‌ వెంటనే హైదరాబాద్‌ చేరుకున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన కరోనాను జయించనున్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని కనుక ఆందోళన పడాల్సిన పని లేదు అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.