అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ లో యానిమల్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ స్టార్ కాస్టింగ్ తో రూపొందుతున్న ఆ సినిమా తర్వాత సందీప్ వంగ చేయబోతున్న సినిమా ఏంటీ అంటే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహేష్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ కు సందీప్ వంగ కథలు చెప్పాడు. వారు కూడా దాదాపుగా ఓకే అన్నారట. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కూడా దర్శకుడు సందీప్ కలిశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి ఈమద్య కాలంలో వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు కమిట్ అవుతున్నాడు. తనను అభిమానించే దర్శకులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే అవకాశం ఉంది. అందుకే వారితో సినిమాను చేస్తానంటూ చెప్పాడు. అందుకే సందీప్ వంగ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పాడేమో అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కాని త్వరలోనే సందీప్ వంగ దర్శకత్వంలో చిరంజీవి మూవీ అయితే ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.