పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా మంచి టాక్ తో బాగానే పెర్ఫార్మ్ చేసింది. అయితే కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా వకీల్ సాబ్ చూడటానికి జనాలు థియేటర్లకు రావడం మానేశారు. ఇక ప్రేక్షకులు లేకపోవడంతో చాలా థియేటర్లు కూడా మొత్తబడ్డాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న డీల్ ను కొంచెం ముందుకు తీసుకొచ్చాడు.
వకీల్ సాబ్ కు ముందుగా 50 రోజుల తర్వాత ఓటిటిలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు 20 రోజుల్లోపే ఓటిటిలో దర్శనమివ్వనుంది. ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది వకీల్ సాబ్.
ముందే ఇలా విడుదల కావడం వల్ల ఇప్పుడు దిల్ రాజు లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. వకీల్ సాబ్ గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 3 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దిల్ రాజుపై కేసు వేయబోతున్నాడట. చూడాలి మరి ఏం జరుగుతుందో.