తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ బొల్లారం ప్రాధమిక ఆరోగ్యాన్ని కోవిడ్ ఆసుపత్రిగా మార్చామని.. పీఎం కేర్ నిధుల ద్వారా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి, డీఆర్ డీఓ చైర్మన్ కు కూడా లేఖలు రాసినట్టు తెలిపారు.
కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ఎంపీగా బాధ్యతతో ఆసుపత్రిని కోవిడ్ సెంటర్ గా మార్చామన్నారు. ఈమేరకు 15 రోజుల క్రితమే నిర్ణయించి పనులు కూడా ప్రారంభించామన్నారు. ప్రస్తుతం అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈక్రమంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.