మన్మథుడు 2.. రాహుల్ తప్పు ఒప్పేసుకున్నాడు

నటుడు రాహుల్ రవీంద్రన్, చి ల సౌ వంటి మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాంటి రాహుల్ తన రెండో సినిమాగా అక్కినేని నాగార్జునతో మన్మథుడు 2 తీసాడు. మన్మథుడు ఎంతటి క్లాసిక్ అన్నది అందరికీ తెల్సిందే. దానికి 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా సీన్లను తీసుకోవాలి. కానీ మన్మథుడు 2 నాగార్జున అభిమానులను విపరీతంగా నిరుత్సాహపరిచింది.

ఇటీవలే రాహుల్ ట్విట్టర్ లో స్పేస్ క్రియేట్ చేసి తానే హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఈ స్పేస్ లో మన్మథుడు 2 టాపిక్ వచ్చింది. ఇందులో అసలు తప్పు ఎక్కడ జరిగిందో క్లియర్ గా చెప్పాడు రాహుల్. సినిమా మొదలైన 20 నిమిషాలకే నాగ్ ఒకమ్మాయితో ఘాటు రొమాన్స్ లో పాల్గొంటాడు.

ఆ సమయంలో రూమ్ మొత్తం షేక్ అయినట్లు చూపించాం. కానీ థియేటర్లో ఆడియెన్స్ రియాక్షన్ చూసిన తర్వాత ఆ సీన్ తీసి ఎంత పెద్ద తప్పు చేసామో అర్ధమైంది. దాని తర్వాత మేము శంకరాభరణం చూపించినా ఫ్యాన్స్ ను సంతృప్తిపరచలేం అని చెప్పుకొచ్చాడు రాహుల్.