మలయాళ సూపర్ స్టార్ కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా స్పీడ్ గానే సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఈమద్య కాలంలో స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలే చేస్తున్నా సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం సినిమాల సంఖ్య తగ్గించలేదు. కనీసం నాలుగు అయిదు సినిమాలు అయినా ఏడాదికి చేస్తున్నాడు. కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆయన సినిమాలు చేస్తూ ఉన్నాడు. మలయాళంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకు పోతున్న మోహన్ లాల్ గత ఏడాది దృశ్యం 2 ను అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆయన నటించిన మరి కొన్ని సినిమాలు కూడా విడుదలకు వెయిట్ చేస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయితే ఆ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
మోహన్ లాల్ నటించిన నటిస్తున్న సినిమాలు మొత్తం ఏడు ఉన్నాయి. ఈ ఏడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటితో పాటు మరో సినిమాను కూడా మోహన్ లాల్ కమిట్ అయ్యాడు. దాంతో ఎనిమిదవ సినిమా గా చెబుతున్నారు. దృశ్యం సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ దక్కించుకున్న జీతూ జోసెఫ్ తో దృశ్యం 2 ను చేసిన మోహన్ లాల్ ప్రస్తుతం రామ్ అనే సినిమాను ఆయన దర్శకత్వంలోనే చేస్తూ ఉన్నాడు. జీతూ జోసెఫ్ తో వరుసగా మరో సినిమాను కూడా మోహన్ లాల్ చేసేందుకు సిద్దం అయ్యాడని మలయాళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఒక వైపు మోహన్ లాల్ తో రామ్ సినిమాను చిత్రీకరిస్తూనే మరో వైపు తెలుగు లో వెంకటేష్ హీరోగా దృశ్యం 2 ను రీమేక్ చేశాడు జీతూ జోసెఫ్. తెలుగు దృశ్యం 2 పూర్తి అయిన నేపథ్యంలో వెంటనే తమిళ దృశ్యం 2 కు ఏర్పాట్లు చేస్తున్నాడు. వరుసగా దృశ్యం 2 లను తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు మోహన్ లాల్ తో రామ్ ను కూడా సమాంతరంగా తెరకెక్కిస్తున్నాడు. రామ్ షూటింగ్ పూర్తి అయ్యి విడుదల కాకముందే తదుపరి సినిమాను కూడా వీరి కాంబోలో ప్రకటించడంతో పాటు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.
మోహన్ లాల్ కు జీతూ జోసెఫ్ కు మద్య దృశ్యం తో మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే వరుసగా సినిమాలను ఆయనతో చేసేందుకు మోహన్ లాల్ సిద్దంగా ఉన్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మోహన్ లాల్ కేవలం మలయాళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు మరియు ఇతర భాషల సినిమా లను కూడా చేస్తూ బిజీగా ఉంటున్నాడు. వరుసగా మోహన్ లాల్ చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. దృశ్యం సక్సెస్ నేపథ్యంలో మోహన్ లాల్ మరియు జీతూ జోసెఫ్ ల కాంబో లో రూపొందుతున్న రామ్ మరియు ఆ తర్వాత రూపొందబోతున్న సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాలు ఉంటాయో చూడాలి.