మొటిమలు.. లావు ఉండటం కూడా తప్పేనా?

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించడం కష్టం. కాని కొందరు మాత్రం హీరోయిన్ లుగా రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకరు ప్రియాంక జవాల్కర్. పేరు ముంబయి ముద్దుగుమ్మది లా ఉన్నా కూడా ఈమె మాత్రం తెలుగు అమ్మాయే. ట్యాక్సీ వాలా సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియాంక ఆ తర్వాత ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.

ఒకటి రెండు చేతిలోకి వచ్చినా కూడా అవి పట్టాలెక్కలేదు. దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఈ అమ్మడు సినిమాలు ఏమీ చేయలేదు. కాని ప్రస్తుతం ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ సినిమాలు కూడా ఈమె చేస్తోంది. త్వరలో సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ నటించింది.

ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ట్యాక్సీ వాలా సినిమా తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కాస్త బరువు పెరగడంతో పాటు మొహం మీద మొటిమలు రావడంతో వైధ్యులను సంప్రదించాను. అప్పుడే నాకు థైరాడ్ తో పాటు హార్మోన్ ల సమస్యలు ఉన్నట్లుగా వైధ్యులు తెలియజేశారు. డాక్టర్ ల సలహాతో నేను యోగా తో పాటు వ్యాయామాలు చేయడం మొదలు పెట్టాను. ప్రత్యేక డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు ఇంట్లో రెగ్యులర్ గా నేను వ్యాయామాలు చేసేదాన్ని.

నా కాలేజీ రోజుల్లోని ఒక ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోకు వచ్చిన నెగటివ్ కామెంట్స్ కు నేను షాక్ అయ్యాను. ఒక అమ్మాయి కాస్త లావుగా ఉండి.. మొహంపై మొటిమలు కలిగి ఉంటే తప్పా. అలా ఉన్నా కూడా నన్ను ఎందుకు విమర్శలు చేస్తారంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల్లోకి రావాలనే బలమైన కోరికతో తాను బరువు తగ్గడంతో పాటు మొటిమలు లేకుండా చూసుకోగలిగాను అంది. ముందు ముందు ఈమె ఇతర భాషల్లో పెద్ద సినిమాలతో పాటు టాలీవుడ్ లో కూడా పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటాననే నమ్మకంను వ్యక్తం చేస్తుంది.